ట్రాన్స్‌ఫర్మేషన్ తో షాకిచ్చిన నాని
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన నేచురల్ స్టార్ నాని తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు.;
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన నేచురల్ స్టార్ నాని తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. కేవలం హీరోగా సినిమాలు చేయడమే కాకుండా నిర్మాతగా మారి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఆఖరిగా హిట్3 సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన నాని ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు పూర్తవుతుంది.
నాని మేకోవర్ చూసి అంతా షాక్
నాని ప్రస్తుతం తనకు దసరాతో సూపర్ హిట్ ను అందించడంతో పాటూ తనకు మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే యాక్షన్ ప్యాక్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం నాని తన బాడీని పూర్తిగా మేకోవర్ చేసుకున్నారు. రీసెంట్ గా నాని ట్రాన్స్‌ఫర్మేషన్ కు సంబంధించిన లుక్ ఒకటి బయటకు వచ్చింది.
నాని బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అతని ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ ను పెంచింది. ది ప్యారడైజ్ లో నాని తన పాత్రకు సరిపోయే బాడీని మేకోవర్ చేయడానికి అతను పడ్డ కష్టం ఆ లుక్ లో చాలా స్పష్టం గా తెలుస్తోంది. అయితే దీనికంతటికీ కారణం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. శ్రీకాంత్ రాసుకున్న క్యారెక్టర్ కోసం నాని తనను తాను మార్చుకుని చాలా కొత్తగా తయారవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇదంతా చూసి నాని డెడికేషన్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. కేవలం జిమ్ సెషన్లు, వ్యాయామాలు మాత్రమే కాకుండా సరైన డైట్.. అన్నీ మెయిన్‌టెయిన్ చేయడం వల్లే నాని ఈ రేంజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ను పొందగలిగాడని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుండగా ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.