నాని 'బాహుబలి' లాంటి సినిమా..?

సుజిత్ సినిమా తర్వాత నాని మళ్లీ తనకు హాయ్ నాన్న లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ శౌర్యువ్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడట.;

Update: 2025-09-17 04:17 GMT

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నాడు. కొత్త దర్శకులతో పని చేస్తూ సూపర్ హిట్లు కొడుతున్నాడు. ఒక్కోసారి ఆల్రెడీ తనకు సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే మరో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం దసరా లాంటి సూపర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతోనే నాని ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా 1980 బ్యాక్ డ్రాప్ తో డిఫరెంట్ స్టోరీ స్క్రీన్ ప్లే తో వస్తుందని టాక్. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది తెలియదు కానీ విలన్ గా మాత్రం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారట. ది ప్యారడైజ్ నుంచి జడల్ క్యారెక్టర్ ని రివీల్ చేసిన మేకర్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.

డైరెక్టర్ శౌర్యువ్ తో నాని..

ఇక ఈ సినిమా తర్వాత నాని ఓజీ డైరెక్టర్ సుజిత్ తో ఒక రొమాంటిక్ యాక్షన్ సినిమా ప్లాన్ చేశాడు. ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యేలా రెడీ అవుతున్నారట. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. సుజిత్ సినిమా తర్వాత నాని మళ్లీ తనకు హాయ్ నాన్న లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ శౌర్యువ్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడట. శౌర్యువ్ ఈసారి నానితో పీరియాడికల్ స్టోరీ చాలా పెద్ద బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నాడట.

ఈ మధ్య కంటెంట్ బాగుంది అంటే చాలు బడ్జెట్ విషయంలో మేకర్స్ అసలు ఆలోచించట్లేదు. నాని మార్కెట్ ఎలాగు బాగుంది కాబట్టి డౌట్ పడాల్సిన అవసరం లేదు. శౌర్యువ్ నానితో బాహుబలి లాంటి భారీ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని టాక్. అంటే బాహుబలి లాంటి కథ అని కాదు.. అంత పెద్ద కాన్వాస్ తో సినిమా అన్నమాట. నాని కూడా పెద్ద స్కేల్ తో సినిమా చేసి నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలని చూస్తున్నాడు.

నాని నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్..

నాని ప్లానింగ్ ఏంటో కానీ శౌర్యువ్ సినిమా మాత్రం మొదలైనప్పటి నుంచి ఒక రేంజ్ లో డిస్కషన్ పాయింట్ అవుతుందని అంటున్నారు. నాని ఇలా తను చేసిన డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తుంటే మిగతా డైరెక్టర్ తో పనిచేసే ఛాన్స్ ఉండదు.

ప్రస్తుతం చేస్తున్న ది ప్యారడైజ్ సినిమాను నాని అండ్ టీం 2026 మార్చి 26న రిలీజ్ ప్లాన్ చేశారు. ఆ సినిమా తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా సుజిత్ సినిమా కూడా రిలీజ్ చేసే ప్లాన్ ఉందట. సో శౌర్యువ్ సినిమా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అనౌన్స్ చేసి 2027 మిడిల్ లేదా ఎండింగ్ రిలీజ్ చేసేలా డిస్కషన్ చేస్తున్నారట. సో నాని నెక్స్ట్ 3 మూవీస్ కూడా చూస్తుంటే డెఫినెట్ హిట్ కంటెంట్ అనట్టే ఉంది.

Tags:    

Similar News