• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని మాస్ షో.. గేట్ రెడీ!

నాని మాస్ షో.. గేట్ రెడీ!

| నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో బలమైన కంటెంట్ ఉంటుంది అని చాలాసార్లు నిరూపించాడు.

By - Tupaki Desk
Update: 2024-08-28 05:34 GMT

నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో బలమైన కంటెంట్ ఉంటుంది అని చాలాసార్లు నిరూపించాడు. ఇక ఇప్పుడు అతని నుంచి రాబోతున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ 'సరిపోదా శనివారం' పై మాస్ ఆడియన్స్ లో కూడా ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. 'అంటే.. సుందరానికి' వంటి క్యూట్ లవ్ స్టోరీని అందించిన దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇప్పుడు అందుకు భిన్నంగా విజిల్స్ వేసే మాస్ కమర్షియల్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.

ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా ఇప్పటికే ఆడియన్స్ లో మంచి వైబ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు ప్రతిదీ కూడా సినిమాను చూడాలి అనే ఫీలింగ్ ను అయితే కలిగించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్స్ అయితే అందుకునే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది.

ఇక ఈ సినిమా అన్ని పనులను పూర్తి చేసుకుని గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. సోషల్ మీడియా ద్వారా మేకర్స్ ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇక నాని కూడా ఒక పవర్ఫుల్ పోస్టుతో సినిమాపై మరికొంత ఆసక్తిని కలిగించాడు. 'నా షో డన్.. ఇక మన షో రేపు మొదలు' అంటూ.. టైటిల్ కార్డ్స్ పడుతున్న సినిమా వీడియోను పోస్ట్ చేశాడు.

నాని ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లుగా అర్థమవుతోంది. నానికి ఇప్పటికే ఒక వర్గం యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా అతనికి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు పూర్తిస్థాయిలో మాస్ ఆడియెన్స్ ను కూడా మెప్పించే విధంగా ఈ సినిమాతో రాబోతున్నాడు. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసుకుంది.

ఓవర్సీస్ లో కూడా ఇప్పటికే ప్రీమియర్ షోలకు టికెట్లు ఒక రేంజ్ లో అమ్ముడు అవుతున్నాయి. కాబట్టి ఈ సినిమాతో నాని తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. పాజిటివ్ టాక్ ఏ మాత్రం వచ్చినా కూడా ఈ వీకెండ్ సినిమాకు తిరుగులేదు అని చెప్పవచ్చు. మరి ఆడియన్స్ ను ఈ సినిమాను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

My show is done ♥️Our show begins tomorrow 🔥#SaripodhaaSanivaaram #SuryasSaturday pic.twitter.com/UyQ1baDUFR

— Nani (@NameisNani) August 28, 2024
Tags:    
  • Saripodhaasanivaaram 
  • Nani 
  • Vivekathreya 
  • Priyankamohan 
  • Tollywood 
  • Sjsuryah 
  • Naturalstarnani 
  • Saripodhaasanivaarammovie 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS