ప్యారడైజ్ మసాలా ఘాటుకు రెడీ!
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో `ప్యారడైజ్` ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.;
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో `ప్యారడైజ్` ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఇంత వరకూ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. నాని `హిట్ ది సెకెండ్ కేస్` షూట్ తో బిజీగా ఉండటంతో సాధ్యపడలేదు. తాజాగా ఆ సినిమా షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో ప్యారడైజ్ ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఈ నెల మూడవ వారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం.
తొలి షెడ్యూల్ లో భాగంగా నానితో పాటు ఇతర ప్రధాన తారాగణహంతా పాల్గొంటుంది. ఓ భారీ యాక్షన్ సీన్ తో ఈ షెడ్యూల్ మొదలవుతుంది. దీనికోసం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ కూడా సిద్దమవుతోంది. యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన సరంజామా అంతా సెట్ లో సిద్దమవుతోంది. హైదరాబాద్ కేంద్రంగా సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో షూటింగ్ అంతా హైదరాబాద్ లోనే ఉంటుందని తెలుస్తోంది.
చాలా వరకూ సెట్లలోనే చిత్రీకరణ జరపున్నారట. అవసరం మేర ఔట్ డోర్ షూటింగ్ కి వెళ్లే అవకాశం ఉంది. అయితే వైజాగ్ లో ఓ షెడ్యూల్ ఉంటుందని వార్తలొస్తున్నాయి. విశాఖ సాగర తీరంలో బీచ్ లోకషన్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందిట. అయితే వీటిని విశాఖలో షూట్ చేస్తారా? కర్ణాటక తీరాన్ని ఎంపిక చేసుకుంటారా? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుందిట. అందులో నిజమెంతో కన్పమ్ అవ్వాల్సి ఉంది.
నాని ఇంత వరకూ పోషించని ఓ డిఫరెంట్ రోల్ ఇది. `దసరా`లో మాస్ నాని ని చూపించిన శ్రీకాంత్ ఇందులో మరో కొత్త ఆహార్యంలో హైలైట్ చేయనున్నాడుట. నాని పోషించే పాత్ర మాస్ గా ఉంటుందని ఇప్పటికే లీక్ అయింది. అయితే ఆ పాత్ర లుక్ ఎలా ఉండబోతుంది? అన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.