ప్యారడైజ్ కథానాయిక ఎవరు..?

ఎలాగు దసరా కాంబినేషన్ సినిమా కాబట్టి మళ్లీ కీర్తి సురేష్ ని తీసుకుంటారా అంటే చెప్పడం కష్టమని అంటున్నారు.;

Update: 2025-09-23 04:43 GMT

నాని ప్యారడైజ్ సినిమా సీక్రెసీ స్ట్రాటజీ ఏంటో కానీ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా సైలెంట్ గా పని కానిస్తున్నారు. ముఖ్యంగా నాని జడల్ రోల్ ఆ పాత్ర డీటైల్స్ సంథింగ్ వెరీ క్యూరియస్ గా అనిపిస్తున్నాయి. ప్యారడైజ్ సినిమా విషయంలో ఫస్ట్ స్టేట్మెంట్ తో పాటు రీసెంట్ గా వచ్చిన జడల్ క్యారెక్టర్ రివీల్ వీడియో కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ది ప్యారడైజ్ సినిమా ని సుధాకర్ చెరుకూరి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

విలన్ గా టర్న్ తీసుకుని..

అంతేకాదు ది ప్యారడైజ్ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ గా చేస్తున్నారన్న టాక్ తెలిసిందే. మోహన్ బాబు కెరీర్ మొదలైంది విలన్ గానే.. ఆ తర్వాత ఆయన హీరోగా అదరగొట్టారు. మళ్లీ ఇప్పుడు విలన్ గా టర్న్ తీసుకుని చేస్తున్నారు. మోహన్ బాబు విలనిజం ది ప్యారడైజ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా 1980 బ్యాక్ డ్రాప్ లో వస్తుందని తెలుస్తుంది.

ఐతే అంతా బాగానే ఉంది కానీ ది ప్యారడైజ్ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా రివీల్ కాలేదు. ఆ విషయాన్ని చిత్ర యూనిట్ చాలా సీక్రెట్ గా ఉంచుతుంది. ది ప్యారడైజ్ సినిమాలో నాని సరసన నటించే ఛాన్స్ ఎవరికి ఇస్తున్నారన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఎలాగు దసరా కాంబినేషన్ సినిమా కాబట్టి మళ్లీ కీర్తి సురేష్ ని తీసుకుంటారా అంటే చెప్పడం కష్టమని అంటున్నారు.

ది ప్యారడైజ్ మాస్ అప్పీల్..

నాని ఈమధ్య వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తప్పకుండా ఈసారి దసరాని మించిన సక్సెస్ అందించేలా ఉన్నారు. నాని దసరా సినిమాతో మాస్ స్టెప్ వేయగా ది ప్యారడైజ్ సినిమా వేరే లెవెల్ మాస్ అప్పీల్ తో వస్తుందని తెలుస్తుంది. ది ప్యారడైజ్ సినిమా అన్ని సర్ ప్రైజ్ లతో నింపుతున్నాడట శ్రీకాంత్ ఓదెల. సినిమాలో జడల్ రోల్ లో నాని ఊహించని విధంగా కనిపిస్తారట. హీరోయిన్ రోల్ కి మంచి స్కోప్ ఉందని టాక్.

నాని ప్యారడైజ్ సినిమా 24 మార్చి 2026 రిలీజ్ లాక్ చేశారు. సినిమా రిలీజ్ టార్గెట్ పెట్టుకుని మరీ సినిమా ప్లాన్ చేస్తున్నారట. నాని శ్రీకాంత్ ఈ ఇద్దరు కలిసి మరోసారి మాస్ ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి అంచనాలతో వస్తుందో చూడాలి. నాని ది ప్యారడైజ్ సినిమా అతని కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తుంది. ఎస్.ఎల్.వి సినిమాస్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో విజువల్ ట్రీట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News