రోజుకు 12 గంటలు.. 15రోజులు.. హీరో డెడికేషన్

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తతం ప్యారడైజ్ సినిమాతో బీజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను పాన్ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు.;

Update: 2025-07-21 04:15 GMT

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తతం ప్యారడైజ్ సినిమాతో బీజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను పాన్ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాలో నాని లుక్ పై ఈ గ్లింప్స్ తో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా కోసం నాని చాలా డెడికేషన్ తో వర్క్ చేస్తున్నారు.

ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ సెట్ లో లెంగ్తీ ఫైట్ సీన్ షూట్ చేశారు. ఈ సీన్స్ సూపర్ గా వచ్చిందని, ఇది బిగ్ స్ర్కీన్ పై చూస్తే ఆడియెన్స్ కు గూస్ బంప్స్ పక్కా అని అంటున్నారు.

అయితే ఈ సీన్ కోసం నాని ఎంతో కష్టపడ్డారట. దాదాపు ఈ సన్నివేశాన్ని 15 రోజులు చిత్రీకరించారట. ఈ సీన్ షూటింగ్ జరుగుతున్న ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు, అంటే మొత్తం 12 గంటల పాటు నాని సెట్స్ లోనే గడిపారట. 15రోజులు ఇలాగే షెడ్యూల్ లో పాల్గొన్నారని తెలిసింది. అయితే షూటింగ్ లొకేషన్ దుమ్ముతో కూడి ఉంటుందట. అక్కడ కొద్ది సేపు నిల్చొని ఉండడమే ఇబ్బందిగా అనిపిస్తుందట. అలాంటిది నాని ఏకంగా 15 రోజులుు అలా అక్కడే షూటింగ్ లో పాల్గొనడం సినిమా పట్ల ఆయనకు ఉన్న డెడికేషన్, ఫ్యాషన్ కు నిదర్శనం.

ఈ ఫైట్ సీన్ కోసం ఇంటర్నేషనల్ లెవెల్ స్టంట్ మాస్టర్లు వచ్చారట. డైరెక్టర్ శ్రీకాంత్ ఎక్కడా కాంప్రమైస్ అవ్వకుండా ఈ సన్నివేశం తెరకెక్కించారని టాక్. ఇది సినిమాలోనే హైలైట్ సీన్ కానుందని అంటున్నారు. అలాగే ఈ ఫైట్ లొకేషన్ చూస్తే, నానికి హ్యాట్స్‌ ఆఫ్ చెప్పడం పక్కానట. పూర్తి ఎఫోర్ట్స్ పెట్టి నాని ఇందులో నటించారని తెలిసింది. దీంతోపాటు మరి కొన్ని ఫైట్, యాక్షన్ సీన్స్ కూడా సినిమాలో ఉన్నాయట. దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్ లో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చేందుకు శ్రీకాంత్ కష్టపడుతున్నారట. ఈ చిత్రాన్ని ఎస్ ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

కాగా, నాని- శ్రీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 2023లో విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ ఫుల్ హైప్ ఇచ్చింది. ఇక ప్యారడైజ్ లోనూ ఈ తరహా సీన్ ను శ్రీకాంత్ ప్లాన్ చేస్తున్నారట.

Tags:    

Similar News