నాని రెండు బ్యానర్లు.. తేడా ఇదే..!
న్యాచురల్ స్టార్ నాని ఓ పక్క హీరోగా వరుస విజయాలతో అదరగొడుతూనే మరోపక్క నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నాడు.;
న్యాచురల్ స్టార్ నాని ఓ పక్క హీరోగా వరుస విజయాలతో అదరగొడుతూనే మరోపక్క నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నాడు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ లో నాని తన అభిరుచి గల సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ లు అందుకుంటున్నాడు. అ! నుంచి కోర్ట్ వరకు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ నాని వాల్ పోస్టర్ సినిమాస్ పనిచేస్తుంది. ఐతే లేటెస్ట్ గా నాని మరో బ్యానర్ ని మొదలు పెట్టాడు. దానికి యునానిమస్ అని పెట్టాడు.
నాని వాల్ పోస్టర్ సినిమాస్, యునానిమస్ రెండు బ్యానర్ ల మధ్య తేడాని రీసెంట్ ఇంటర్వ్యూలో వివరించాడు నాని. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు ఉందని అందులో నేను మిగతా వాళ్లు నటించడం జరగదని అన్నాడు. మరోపక్క యునానిమస్ బ్యానర్ లో స్టార్స్ తో సినిమా చేయడానికి పెట్టానని చెప్పాడు నాని.
నెక్స్ట్ చిరంజీవి తో చేస్తున్న సినిమా యునానిమస్ బ్యానర్ లోనే వస్తుందని.. ఇక మీదట ఆ బ్యానర్ లోనే స్టార్ సినిమాలు వస్తాయని అన్నాడు నాని. ఐతే వాల్ పోస్టర్ సినిమా మాత్రం కొత్త వారి కోసమే పెట్టామని దానిలో స్టార్స్ నటించే అవకాశం లేదని అన్నాడు నాని. మొత్తానికి హీరోగా సక్సెస్ అవ్వడమే కాదు తనతో పాటు మరికొంతమందికి లైఫ్ ఇవ్వడం అన్నది గొప్ప విషయం.
నాని ప్రస్తుతం హిట్ 3 సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మే 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి ప్రమోషన్స్ భారీగా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ప్యారడైజ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో నాని డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నాడు. దసరా కాంబోలో సినిమా అనేసరికి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడన్నది చూడాలి. నాని సినిమా చేయడం ఒక ఎత్తైతే ప్రమోషన్స్ ఒక ఎత్తు అనేలా చేస్తాడు. ఏ హీరో కూడా ఇలా సినిమాను తన భుజాన వేసుకుని రిలీజ్ కి 20 రోజుల ముందు నుంచి ప్రతి రోజు ప్రమోషన్స్ చేయడు. కానీ నాని మాత్రం సినిమా చేయడమే కాదు ప్రమోషన్స్ లో కూడా తన మార్క్ చాటుతున్నాడు. హిట్ 3 హిట్టైతే నాని సక్సెస్ మేనియా కొనసాగుతున్నట్టే లెక్క అని చెప్పొచ్చు.