డిజాస్టర్ అంటే ఏంటీ? ఎలాంటి సినిమా డిజాస్టర్?
ఏదైనా వేడి వేడిగానే తింటే బాగుంటుంది అంటారు. చల్లారాక తింటే ఆ మజా ఉండదు. రివ్యూస్ కూడా అంతే. ఏ రోజు సినిమా విడుదలైతే ఆ రోజు రివ్యూ ఇస్తేనే బాగుంటుంది.;
ఏదైనా వేడి వేడిగానే తింటే బాగుంటుంది అంటారు. చల్లారాక తింటే ఆ మజా ఉండదు. రివ్యూస్ కూడా అంతే. ఏ రోజు సినిమా విడుదలైతే ఆ రోజు రివ్యూ ఇస్తేనే బాగుంటుంది. సినిమా విడుదలై నాలుగు రోజులయ్యాక రివ్యూ ఇస్తే ఫలితం ఏముంటుంది? అనే వాదన చాలా రోజులుగా వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల వాదన మరోలా ఉంది. సినిమా రివ్యూల విషయంలో చాలా కాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ అయినా రెండు మూడు రోజులు తరువాత రివ్యూస్ ఇస్తే బాగుంటుందని ఇండస్ట్రీ వర్గాలు వాదిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా హీరో నాని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తూ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ `హిట్ ద థర్డ్ కేస్`. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ హిట్ ఫ్రాంఛైజీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలిసారి నాని రూత్‌లెస్ కాప్‌గా మోస్ట్ వయోలెంట్ క్యారెక్టర్‌గా నటించడంతో సహజంగానే `హిట్ 3`పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాని శైలేష్ కొలను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసింది.
మే 1న భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్‌గా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ మూవీ కోసం హీరో నాని, హీరోయిన్ శ్రీనిధిశెట్టితో కలిసి ఎగ్రెసీవ్‌గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవలే ముంబై వెళ్లిన టీమ్ త్వరలో యుఎస్‌లో పర్యటించి అక్కడ అభిమానులతో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ కాబోతోంది. ఈ సందర్భంగా హీరో నాని రివ్యూలపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. `హిట్ 3` ప్రమోషన్స్‌లో భాగంగా నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
`ఒకప్పుడు అయితే ఓకేగానీ ఇప్పుడు ఎవరిని ఆపగలం. ఫలానా పాట, సన్నివేశం నాకు నచ్చలేదు` అని చెప్పొచ్చు. కానీ ఈ సినిమా ఆడదు అని డిసైడ్ చేయొద్దని నా విజ్ఞప్తి. వారం, పది రోజుల పాటు ఏదైనా సినిమాని ప్రేక్షకులు చూడకపోతే అప్పుడు డిజాస్టర్ అని డిక్లేర్ చేయండి` అని నాని స్టేట్మెంట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. మరో విషయం గురించి మాట్లాడుతూ `నా సినిమా విషయంలో జరగలేదు కానీ `అబ్బో తలనొప్పి వచ్చేసింది`. అని కొన్ని మూవీస్ విషయంలో కొందరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లు చూశా. వ్యక్తిగతంగా ఓకే కానీ ప్రొఫెషనల్స్ కూడా అలా చేయడం తగదు` అని నాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇక్కడ నాని డిజాస్టర్ అనే మాటని నొక్కి చెప్పడానికి కారణం లేకపోతేదు. తక్కువ రేటింగ్ ఇచ్చిన సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్‌ని సాధించిన సందర్భాలున్నాయి. ఒక వేళ పెట్టిన పెట్టుబడి మొత్తంగా రాకపోతే అలాంటి సినిమాలను డిజాస్టర్‌గా పరిగణిస్తారు. కానీ సినిమా రిలీజ్ రోజే బిజినెస్, వసూళ్లతో సంబంధం లేకుండానే కొంత మంది డిజాస్టర్ అని డిసైడ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని, పది రోజుల తరువాత కూడా ఆ సినిమా ఎవరూ చూడకపోతే, పెట్టిన పెట్టుబడిని రాబట్టలేకపోతే అలాంటి సినిమాలని మాత్రమే డిజాస్టర్లుగా పరిగణించమని తాజాగా నాని చెప్పడం గమనార్హం.