నాని మేకోవర్.. రఫ్ఫాడించేస్తాడా..?
ప్రెజంట్ టాలీవుడ్ హీరోల్లో సక్సెస్ ల విషయంలో బీస్ట్ మోడ్ లో ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని.;
ప్రెజంట్ టాలీవుడ్ హీరోల్లో సక్సెస్ ల విషయంలో బీస్ట్ మోడ్ లో ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని. తను ఏ సినిమా చేసినా సరే సూపర్ హిట్ పక్కా అనేలా పరిస్థితి ఉంది. అసలు నాని స్టోరీ సెలక్షన్ చూసి మిగతా వాళ్లంతా కూడా ఫిదా అయిపోతున్నారు. ఒక సినిమా ఒకలా నెక్స్ట్ మరోలా ఇలా ప్రతి సినిమా డిఫరెంట్ జోనర్ లో చేస్తూ వస్తున్నాడు. ఐతే నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని మాస్ మేకోవర్ క్యూరియాసిటీ పెంచుకుంది.
నాని స్టోరీ సెలక్షన్..
ది ప్యారడైజ్ లో నాని డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈమధ్యనే జడల్ అంటూ రెండు జడలతో తన లుక్ రివీల్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చాడు నాని. ఇక నెక్స్ట్ మరో రఫ్ లుక్ ఉంటుందని తెలుస్తుంది. ఐతే ఆ లుక్ కోసం నాని తన జుట్టు, గడ్డం బాగా పెంచేస్తున్నాడు. గుబురు గడ్డం.. ఒత్తైన జుట్టుతో నాని డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. అసలైతే ఈ లుక్ ని ఎక్కడ రివీల్ చేయరు కానీ నాని అలానే ఈవెంట్స్, షోస్ కి వస్తున్నాడు.
రీసెంట్ గా జగపతి బాబుతో జయమ్ము నిశ్చయమ్మురా అంటూ ఒక స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్నాడు నాని. ఆ షోలో నాని లుక్ అదిరిపోయింది. ఐతే పైన హెయిర్ కవర్ చేసేందుకు క్యాప్ ఒకటి పెట్టుకుని వచ్చాడు. అంతేకాదు రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఒక పెళ్లిలో కూడా నాని రఫ్ లుక్ తో సర్ ప్రైజ్ చేశాడు. దసరాలో కూడా నాని మాస్ రోల్ చేశాడు కానీ ఇప్పుడు ది ప్యారడైజ్ కోసం చేస్తున్న ఈ రోల్ మాత్రం ఇంకా ఎక్స్ ట్రీం లెవెల్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది.
నెక్స్ట్ లెవెల్ మాస్ అప్పీల్..
నాని ది ప్యారడైజ్ తో నెక్స్ట్ లెవెల్ మాస్ అప్పీల్ తో వస్తున్నాడు. శ్రెకాంత్ ఓదెల నాని కలిసి ఈసారి మరింత భారీగా ఏదో చేయబోతున్నారు. తప్పకుండా ఈ కాంబినేషన్ మరోసారి అదరగొట్టేయబోతుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో నాని తో జత కట్టే హీరోయిన్ ఎవరన్నది చూడాలి.
ది ప్యారడైజ్ తర్వాత నాని సుజిత్ డైరెక్షన్ లో సినిమా లక చేసుకున్నాడు. ఆ సినిమా రోం కోం ఎంటర్టైనర్ గా ఉంటుందని టాక్. అందులో నాని స్టైలిష్ లుక్ తో కనిపిస్తాడట. మరి నాని నుంచి రాబోతున్న ఈ సినిమాలు ఒక దానికి మించి మరోటి అనేలా ఉంటుందని చెప్పొచ్చు.