పిక్‌టాక్‌ : మహేష్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి కన్నుల విందు

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మంచి స్నేహితులు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.;

Update: 2026-01-08 10:21 GMT

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మంచి స్నేహితులు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి అభిమానులు సోషల్‌ మీడియాలో, బాహాటంగా థియేటర్ల వద్ద గొడవ పడతారేమో కానీ, వీరిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా గౌరవం, అభిమానం అనే విషయం ఇప్పటికే చాలా సందర్భాల్లో నిరూపితం అయ్యింది. ఇద్దరూ రెగ్యులర్‌గా కలిసి పార్టీల్లో పాల్గొనడం మొదలుకుని అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మనం చూస్తూ ఉంటాం. ఆ మధ్య ఎన్టీఆర్‌ సినిమా కోసం మహేష్‌ బాబు, మహేష్‌ బాబు సినిమా కోసం ఎన్టీఆర్‌ తమ వంతు సాయం అన్నట్లుగా ప్రమోషన్‌లోనూ భాగస్వామ్యం కావడం ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. దాంతో ఇద్దరు హీరోల కాంబోలో ఫోటో కోసం అభిమానులు మీడియా వారు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇద్దరు హీరోల ఫోటో రాలేదు కానీ వారి భార్యల ఫోటో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

లక్ష్మీ ప్రణతి, నమ్రత శిరోద్కర్‌లు...

ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు మహేష్‌ బాబు భార్య నమ్రత శిరోద్కర్‌ లు బర్త్‌డే పార్టీలో పాల్గొన్నారు. నమ్రతకి అత్యంత సన్నిహితురాలు అయిన స్వాతి పుట్టిన రోజు సందర్భంగా పెద్ద పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీలో పలువురు టాలీవుడ్‌ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇదే బర్త్‌డే పార్టీలో మాజీ హీరోయిన్‌ అయిన నమ్రత సింపుల్‌ అండ్‌ బ్యూటీఫుల్‌ ఔట్‌ ఫిట్‌ లో కనిపించి అందరిని సర్‌ప్రైజ్ చేసింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయింది, ఇక పిల్లలు ఇద్దరు పెద్ద వారు అయినా, వయసు పెరుగుతున్నా నమ్రత చాలా అందంగా పాతికేళ్ల హీరోయిన్ మాదిరిగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయిలో అందంగా ఉండటంతో ఇప్పటికీ నమ్రతను చాలా మంది రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆమె మాత్రం రీ ఎంట్రీ విషయంలో అసలు ఆసక్తిని కనబర్చడం లేదు. నమ్రత నటిస్తానంటే వెంటనే పది సినిమాలు ఆమె చేతిలో పడుతాయి అనడంలో సందేహం లేదు.

బర్త్‌డే పార్టీలో టాలీవుడ్‌ సెలబ్రిటీలు...

ఇదే పార్టీలో పాల్గొన్న లక్ష్మీ ప్రణతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈమె చాలా అరుదుగా మాత్రమే సోషల్‌ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. అయితే కనిపించిన ప్రతి సారి కూడా ఈమె ఫోటోలు వైరల్‌ కావడం మనం చూస్తూ ఉంటాం. ఎన్టీఆర్‌ కి జోడీగా ఎప్పటికీ క్యూట్‌గా అందంగా లక్ష్మీ ప్రణతి కనిపిస్తూ ఉంటారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌ భార్య కావడంతో ఈమె గురించి మీడియాలో రెగ్యులర్‌గా వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈమె ఇలా బర్త్‌డే వేడుకలో పాల్గొన్న కారణంగా వార్తల్లో నిలిచింది. ఇద్దరు కొడుకులకు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ఎన్టీఆర్‌ బిజీగా ఉండటంతో కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, వ్యాపార విషయాలను చూసుకుంటుంది. దాంతో ఇలాంటి కార్యక్రమాలకు ఆమె పాల్గొనేందుకు ఆహ్వానాలు రెగ్యులర్‌గా అందుకుంటూనే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు మాత్రమే లక్ష్మీ ప్రణతి ఇలా పార్టీల్లో కనిపిస్తూ ఉంటారు.

ఎన్టీఆర్‌ డ్రాగన్‌, మహేష్‌ బాబు వారణాసి

ఇక ఎన్టీఆర్‌ సినిమా విషయానికి వస్తే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. కేజీఎఫ్‌, సలార్‌ సినిమాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు డ్రాగన్‌ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక మహేష్ బాబు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వారణాసి సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. వాటన్నింటికి వచ్చే ఏడాదిలో ఖచ్చితంగా రాజమౌళి సమాధానం చెప్పడం ఖాయం అని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.

Tags:    

Similar News