నాగార్జున అప్ క‌మింగ్ ప్రాజెక్ట్ లివే!

అలాగే బాలీవుడ్ లో 'బ్ర‌హ్మ‌స్త్ర 2' ఉంటుంద‌ని ..అందులో నాగార్జున పాత్ర ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు ఆయాన్ ముఖ‌ర్జీ త‌న‌కు చెప్పిన‌ట్లు నాగార్జున రివీల్ చేసారు.;

Update: 2025-06-20 06:09 GMT

'కూలీ', 'కుబేర' చిత్రాల‌తో కింగ్ నాగార్జున ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నారు. మ‌రి త‌దుప‌రి కింగ్ చేయ‌బోయే సినిమాలేంటి? వంద‌వ సినిమా విష‌యంలో ఎన్నో స‌స్పెన్స్ లున్నాయి? అది లాక్ అయిందా? లేదా? ఇలాంటి ఎన్నో సందేహాలున్నాయి. తాజాగా వాట‌న్నింటికి నాగార్జున క్లారిటీ ఇచ్చేసారు. నాగార్జున వంద‌వ చిత్రంతో త‌మిళ ద‌ర్శ‌కుడు కార్తీక్ తో ఉంటుంద‌ని నిర్దారించారు. ఈ సినిమా క‌థ ఎలా ఉంటుంది? పాత్ర ఎలా ఉంటుంది? అన్న‌ది త‌ర్వాత చెబుతాన‌న్నారు.

అలాగే ఈ చిత్రాన్ని సొంత నిర్మాణ సంస్థ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో నిర్మిస్తామ‌న్నారు. అతి త్వ‌ర‌లోనే ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కుతుంద‌న్నారు. ఇది కాకుండా ఇత‌ర సినిమాల విష‌యానికి వ‌స్తే సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ లో , పీపూల్ మీడియా ఫ్యాక్ట‌రీలో క‌మిట్ మెంట్లు ఉన్నాయ‌న్నారు. అయితే వాటికి ద‌ర్శ‌కులు, క‌థ‌లు ఇంకా ఫైన‌ల్ కాలేద‌న్నారు. ప్ర‌స్తుతం వాళ్లంతా అదే ప‌నిలో బిజీగా ఉన్న‌ట్లు తెలిపారు.

ఈ రెండు సంస్థ‌లే కాకుండి మ‌రికొన్నింటిలోనూ క‌మిట్ మెంట్లు ఉన్న‌ట్లు తెలిపారు. అలాగే బాలీవుడ్ లో 'బ్ర‌హ్మ‌స్త్ర 2' ఉంటుంద‌ని ..అందులో నాగార్జున పాత్ర ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు ఆయాన్ ముఖ‌ర్జీ త‌న‌కు చెప్పిన‌ట్లు నాగార్జున రివీల్ చేసారు. ప్ర‌స్తుతం ఆయాన్ 'వార్ 2'లో బిజీగా ఉన్నాడ‌ని..అది పూర్త‌యిన త‌ర్వాత 'బ్ర‌హ్మాస్త్ర 2 'అప్ డేట్ వ‌స్తుంద‌న్నారు.

అవ‌న్నీ ప‌క్క‌న బెడితే నాగార్జున 100వ చిత్రం ఇదే ఏడాది ఉంటుంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది. 'నా సామి రంగ' త‌ర్వాత కింగ్ సోలో చిత్రం క‌మిట్ అవ్వ‌క పోవ‌డంతో 100వ సినిమా ఇంకెప్పుడు చేస్తార‌ని అక్కినేని అభిమానుల్లో నిరుత్సాహం క‌నిపించేది. కానీ కింగ్ అధికారిక ప్ర‌క‌ట‌న‌తో అభిమానుల ఆనందానికి అవ‌ధు లుండ‌వ్.

Tags:    

Similar News