రామోజీరావు, సురేష్ బాబు రిజెక్ట్ చేసిన తర్వాతే!
నాగార్జున-రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన `శివ` అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.;
నాగార్జున-రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన `శివ` అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన చిత్రం ఇద్దరి కెరీర్ లోనూ గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. అప్పటికే నాగార్జున పెద్ద స్టార్. `గీతాంజలి` లాంటి క్లాసిక్ హిట్ అప్పుడే పడింది. అయినా సరే శివ స్టోరీ చెప్పగానే ఒకే చేసారు. అప్పటికి వర్మ కి సినిమాపై ఎలాంటి అనుభవం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయలేదు. రైటింగ్ డిపార్ట్ మెంట్ లోనూ పని చేయలేదు. అయినా సరే కథపైనా, తన ఫ్యాషన్ చూసి అక్కినేని వెంకట్ అవకాశం కల్పించారు.
అయితే అందుకు కారణం అదే స్టూడియోలో రాంగోపాల్ వర్మ తండ్రి సౌండ్ ఇంజనీర్ గా పని చేయడం అన్నది కీలకం. తండ్రి రికమండీషన్ తోనే వర్మ వెంకట్ వరకూ వెళ్లగలిగారు. అలా మొదలైన ఇద్దరి పరి చయంతో వెంకట్, నాగార్జునలకు వర్మలో ట్యాలెంట్ ని గుర్తించారు. పరిచయం పెరగడం...అతడిపై నమ్మకం కలగడంతో `శివ` మొదలైంది. ఈ సినిమా అప్పట్లో తెలుగు కంటే? తమిళనాడు, కర్ణాటక నుంచే ఎక్కువ లాభాలొచ్చాయని వెంకట్ తెలిపారు. సొంతగా పంపిణీ చేయడంతోనే ఆయా రాష్ట్రాల నుంచి లాభాలొచ్చినట్లు గుర్తు చేసుకున్నారు.
వాళ్లిద్దరి నుంచి రిజెక్షన్:
అయితే ఇదే కథ పట్టుకుని రాంగోపాల్ వర్మ వెంకట్ కంటే ముందే రామోజీరావు దగ్గరకు వెళ్లారుట. కానీ రామోజీరావు కి వర్మపై నమ్మకం లేకపోవడంతో పాటు, ఎవరి దగ్గర పని చేసిన చిన్న అనుభవం కూడా లేకపోవడంతో రిజెక్ట్ చేసారుట. ఆ తర్వాత సురేష్ బాబు దగ్గరకు వెళ్లారుట. ఆయన కూడా రిజెక్ట్ చేసారుట. అనంతరం అక్కినేని కాంపౌండ్ లో కాలు పెట్డడంతో వర్మ కు దర్శకుడిగా అవకాశం కల్పించినట్లు తెలి పారు.
గొప్ప అవకాశంగా:
ఈ విషయాన్ని వర్మ కూడా ఎంతో గొప్పగా చెబుతారు. తన జీవితంలో జరిగిన నాగార్జున అనే మంచోడు తగలడంతోనే? తన జీవితం మారిందని వర్మ చెబుతుంటారు. `శివ` తర్వాత వర్మ జీవితమే మారి పోయింది. ఒక్క హిట్ తోనే దర్శకుడిగా ఎనలేని గుర్తింపు దక్కింది. స్టార్ హీరోలతో పనిచేసే అవకాశం లభించింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లి హిందీలోనూ సత్తా చాటారు. దర్శకుడిగా అక్కడా తనదైన ముద్ర వేసారు. అదే సక్సెస్ ఇమేజ్ తో ఇప్పటికీ గొప్ప దర్శకుడిగా నీరాజనాలు అందుకోవడం కూడా ఆయనకే సాద్య మైంది. సాధారణంగా వరుస పరాజయాలతో ఇమేజ్ ని కోల్పోతారు. కానీ వర్మ పై మాత్రం ఇప్పటికీ అదే ఇమేజ్. అదే ఛరిష్మాతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.