• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్ : టాలీవుడ్‌...

పిక్ టాక్ : టాలీవుడ్‌ కింగ్‌ సూపర్ స్టైలిష్

| ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్ విపరీతంగా ఉండే నాగార్జున ప్రస్తుతం కుబేరా తో పాటు రజినీకాంత్‌ సినిమాలోనూ నటిస్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-10-01 13:16 GMT

టాలీవుడ్ సీనియర్ స్టార్‌ హీరోల్లో నాగార్జున ఒకరు. ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న హీరోల్లో నాగ్ ఒకరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇద్దరు కొడుకులు హీరోలుగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనూ నాగార్జున యంగ్‌ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆయన అంటే పడిచచ్చే వారు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్ విపరీతంగా ఉండే నాగార్జున ప్రస్తుతం కుబేరా తో పాటు రజినీకాంత్‌ సినిమాలోనూ నటిస్తున్నాడు.


నాగార్జున హీరోగా నటించే సినిమాల కోసం ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇతర హీరోల సినిమాల్లో నటిస్తున్న నాగార్జున ఎప్పుడెప్పుడు సోలో హీరోగా సినిమా చేస్తాడా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఆయన నుంచి వచ్చిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొడుకులు చైతూ, అఖిల్ కి ఏమాత్రం తగ్గకుండా చాలా హ్యాండ్సమ్‌ గా ఈ ఫోటోల్లో కనిపిస్తున్నాడు అంటూ నాగార్జున తాజా లుక్‌ పై ఫ్యాన్స్‌ తో పాటు ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు.

సుదీర్ఘ కాలంగా ఒక జోనర్ సినిమాలు చేయడం ద్వారా విమర్శలు ఎదుర్కొంటున్న నాగార్జున ఇక మీదట వరుసగా సినిమాలు చేయాలని, అది కూడా విభిన్నమైన కాన్సెప్ట్‌ లతో సినిమాలు చేయాలని ఆశ పడుతున్నాడు. అందుకు తగ్గట్లుగానే కథలు ఎంపిక చేసుకునే పనిలో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఎక్కువ కథలు వింటున్న నాగార్జున వయసుకు తగ్గ పాత్రలు చేయాలని భావిస్తున్నాడట. అందుకే నాగార్జున సినిమాలు ఎక్కువ రావడం లేదని తెలుస్తోంది. త్వరలోనే నాగ్‌ హీరోగా సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ధనుష్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌ గా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర సినిమాలో నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రంలోనూ శేఖర్ కమ్ముల కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ రెండు సినిమాల ఫలితాలను బట్టి నాగార్జున భవిష్యత్తు ప్లాన్‌ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. నాగార్జున తాజా ఛార్మింగ్ లుక్ కి ఫ్యాన్స్‌ తో పాటు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇదే లుక్ తో సినిమా ల్లో కనిపించాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది లో నాగ్‌ హీరోగా సినిమా వస్తుందా అనేది చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Kubera 
  • Nagarjuna 
  • Nagarjunalook 
  • Dhanush 
  • SekharKammula 

Similar News

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

Copyright @2026

Powered by Blink CMS