ఏంటీ.. నాగార్జున ఆ హోటల్ లో క్లీనింగి పని చేశారా?

అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే.. నాగార్జున జగపతి బాబు ఇద్దరూ ఇండస్ట్రీకి రాకముందు నుండే మంచి ఫ్రెండ్స్ అట.;

Update: 2025-08-16 10:30 GMT

అక్కినేని నాగార్జున ఎంత పెద్ద స్థాయిలో ఉన్నారో చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి నాగార్జున తనలో ఉన్న కొత్తకోణాన్ని కూలీ,కుబేర వంటి సినిమాలతో బయట పెట్టేశారు. కేవలం హీరోగానే కాదు తన విలనిజంతో కూడా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. అయితే అలాంటి నాగార్జున తాజాగా జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే షోకి గెస్ట్ గా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇన్ని రోజులు సినిమాలు చేసిన జగపతి బాబు యాంకర్ గా మారి జీ తెలుగులో జయమ్ము నిశ్చయమ్మురా అనే షోతో కొత్త అవతారం ఎత్తారు. అయితే అలాంటి జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి ఫస్ట్ గెస్ట్ గా తన ఫ్రెండ్ అయినటువంటి నాగార్జునని ఆహ్వానించారు.

అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే.. నాగార్జున జగపతి బాబు ఇద్దరూ ఇండస్ట్రీకి రాకముందు నుండే మంచి ఫ్రెండ్స్ అట. వీరి మధ్య ఉన్న బాండింగ్ కారణంగానే జగపతి బాబు తన షోకి ఫస్ట్ గెస్ట్ గా నాగార్జునని ఆహ్వానించినట్టు తెలిపారు. అయితే ఈ షోలో నాగార్జున గురించి ఓ సీక్రెట్ విషయాన్ని బయట పెట్టారు జగపతిబాబు.. అదేంటంటే నాగార్జున హోటల్ క్లీన్ చేశారట. మరి ఇంతకీ స్టార్ హీరో అయినటువంటి నాగార్జున హోటల్ లో క్లీన్ చేయడం ఏంటి? జగపతిబాబు చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

జయమ్ము నిశ్చయమ్మురా షోకి గెస్ట్ గా వచ్చిన నాగార్జున గురించి ఎవరికీ తెలియని ఓ సంచలన విషయాన్ని బయట పెట్టారు జగపతిబాబు. ఆయన మాట్లాడుతూ.. "నాగార్జున నేను ఓసారి పనిమీద సింగపూర్ వెళ్ళాము. అక్కడ ఫైవ్ స్టార్ హోటల్లో ఉండడానికి దిగాము. కానీ అక్కడ నేను నాగార్జున కలిసి హోటల్ ని అశుభ్రం చేయడంతో ఇది గమనించిన హోటల్ యాజమాన్యం నాగార్జునకి మాప్ ఇచ్చి క్లీన్ చేయమని ఆర్డర్ వేశారు.దాంతో చేసేదేమీ లేక నాగార్జున సింగపూర్ హోటల్లో మాప్ తో క్లీన్ చేశారు" అంటూ సంచలన విషయాన్ని బయట పెట్టారు జగపతిబాబు. జగపతిబాబు మాటలకి నాగార్జున కూడా అవునవును అప్పుడు జరిగిన ఈ ఘటన నాకు కూడా కాస్త గుర్తుంది అంటూ చెప్పుకొచ్చారు.. అలా హీరో అయినా కూడా నాగార్జునకి ఈ తిప్పలు తప్పలేదు అంటూ జగపతిబాబు చెప్పిన మాటలతో చాలామంది నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు..

ఇదే షోలో నాగార్జున వల్లే నేను ఇండస్ట్రీకి వచ్చానంటూ జగపతిబాబు మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఎందుకంటే జగపతిబాబు సినిమాల్లోకి రాకముందు వైజాగ్ లో ఓ ఫర్నిచర్ షాప్ లో వర్క్ చేసేవాడట. అలా సమయం దొరికినప్పుడు సినిమా షూటింగ్ లు చూస్తున్న సమయంలో నాగార్జునని చూసి అట్రాక్ట్ అయ్యి సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారట. అలా నాగార్జున వల్లే తాను సినిమాల్లోకి వచ్చానంటూ జగపతిబాబు ఆసక్తికర విషయాలు ఈ షోలో చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News