నాగార్జునతో పెట్టుకుంటే మాత్రం..!
టాలీవుడ్ కింగ్ నాగార్జున కేవలం స్టార్ హీరోగానే కాదు ఆయన బిజినెస్ మ్యాన్ గా కూడా అదరగొట్టేస్తుంటారు.;
టాలీవుడ్ కింగ్ నాగార్జున కేవలం స్టార్ హీరోగానే కాదు ఆయన బిజినెస్ మ్యాన్ గా కూడా అదరగొట్టేస్తుంటారు. ఏఎన్నార్ తర్వాత అక్కినేని హీరోగా ఫ్యాన్స్ ని మెప్పిస్తూనే బిజినెస్ లో నాగార్జున టాప్ రేంజ్ కి వెళ్లారు. సినిమా హీరోగా ఉంటూనే ఆయన కొత్త కొత్త బిజినెస్ లు చేస్తుంటారు. హీరో అవ్వకముందు యూఎస్ లో స్టడీస్ చేయడం వల్ల నాగార్జున కెరీర్ మొదటి నుంచి సినిమాలతో పాటు పార్లర్ గా ఏదో ఒక బిజినెస్ ఆలోచనతో సర్ ప్రైజ్ చేసే వారు.
నాగార్జున బుల్లితెర షోలు కూడా..
ఇక వాణిజ్య ప్రకటనలతో నాగార్జున తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ ఏర్పరచుకున్నారు. బుల్లితెర షోలు కూడా స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా అది దానికి ప్లస్ అయ్యేలా చేసుకున్నారు. ఐతే ఇన్ని చేస్తున్న నాగార్జున మారుతున్న కాలానికి తగినట్టుగానే తన పేరుని లేదా వాయిస్ ని వాడి ఏదైనా బిజినెస్ చేస్తే మాత్రం చట్టపరమైన చిక్కుల్లో పడేలా హైకోర్ట్ లో పిటీషన్ వేశారు.
ప్రస్తుతం ఏ.ఐ టెక్నాలజీతో సంబంధిత వ్యక్తి పర్మిషన్ లేకుండానే ఏదైనా చేస్తున్నారు. ఐతే నాగార్జున కూడా ముందుస్తు జాగ్రత్తగా తన పేరుని, వాయిస్ ని తన పర్మిషన్ లేకుండా వాడితే చట్టపరమైన ఇబ్బదుల్లో పడతారని కోర్టులో పిటీషన్ వేశారు. రీసెంట్ గా కోర్టు దాన్ని పరిశీలించింది. నాగార్జున కోరినట్టుగానే అతని పర్మిషన్ లేకుండా ఎలాంటి ప్రకటన అయినా తన పర్మిషన్ కావాల్సిందే. నాగార్జున రైట్స్ కు రక్షణగా హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.
ఏ.ఐ, డీప్ ఫేక్ వీడియోలు చేసినా సరే..
నాగార్జున గురించి ఏ.ఐ, డీప్ ఫేక్ వీడియోలు చేసినా సరే లీగల్ యాక్షన్ ఉంటాయని వెల్లడించారు. సో అందరిలా సమస్య వచ్చినప్పుడే కాకుండా ముందస్తు జాగ్రత్తగా నాగార్జున ఈ జాగ్రత్తలు తీసుకోవడం ఆయన ప్లానింగ్ ఏంటో తెలుస్తుంది. తప్పు జరిగిన తర్వాత జాగ్రత్త పడకుండా అసలు తప్పు జరగకముందే జాగ్రత్త పడితే బెటర్ అనేలా నాగార్జున ప్లానింగ్ ఉంది.
నాగార్జున సినిమాల విషయానికి వస్తే ఈ ఇయర్ కింగ్ నాగార్జున కుబేర, కూలీ రెండు సినిమాల్లో నటించారు. ఐతే ఆ రెండిటిలో ఒక దానిలో సపోర్టింగ్ రోల్, మరో దానిలో విలన్ రోల్ చేశారు. ఈ రెండు సినిమాలు చేయడం వల్ల నాగార్జునకు ఎంత కిక్ వచ్చిందో కానీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం చాలా డిజప్పాయింట్ గా ఉన్నారు. నాగార్జున సోలో సినిమా కోసం వాళ్లు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.