సంక్రాంతికి ముహూర్తం.. సంక్రాంతికే రిలీజ్..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమా తర్వాత సోలో సినిమా విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు.;

Update: 2025-12-11 13:30 GMT

టాలీవుడ్ కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమా తర్వాత సోలో సినిమా విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే నాగార్జున కెరీర్ లో అది 100వ సినిమా అవ్వడం విశేషం. ఐతే ఈ ఇయర్ కుబేర, కూలీ సినిమాల్లో స్పెషల్ రోల్స్ లో కనిపించారు నాగార్జున. కుబేరలో సపోర్టింగ్ రోల్ చేయగా కూలీలో కంప్లీట్ నెగిటివ్ రోల్ లో ఇంప్రెస్ చేశారు. లోకేష్ కనకరాజ్ సినిమాలో నటించాలనే ఉద్దేశ్యంతో కూలీ సినిమా ఒప్పుకున్నారు నాగార్జున. ఐతే ఆ సినిమాపై ఉన్న అంచనాలను రీచ్ కాలేదు.

100వ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండాలనే..

ఇక నెక్స్ట్ తన సోలో సినిమా కోసం ఫ్యాన్స్ ని మరీ వెయిటింగ్ లో పెట్టడం ఇష్టం లేని కింగ్ సినిమా అనౌన్స్ మెంట్ కి రెడీ అవుతున్నారని తెలుస్తుంది. 100వ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండాలనే కారణంతోనే ప్రీ ప్రొడక్షన్ టైం లోనే అంతా సెట్ చేసుకుంటున్నారట. ప్రాజెక్ట్ అనుకున్న విధంగా వస్తుందా రాదా అన్న క్లారిటీ వచ్చిన తర్వాతే అనౌన్స్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నారు. తమిళ దర్శకుడు కార్తీక్ తో నాగార్జున 100వ సినిమా చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమా స్టోరీ ఏంటన్నది బయటకు రాలేదు.

ఐతే నాగార్జున మాత్రం ఈ మూవీని నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. సినిమా అనౌన్స్ మెంట్ కూడా త్వరలోనే వస్తుందట. అంతేకాదు 2026 సంక్రాంతికి సినిమా ముహూర్తం పెట్టే ప్లానింగ్ ఉందట. సంక్రాంతికి పూజ చేసి నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ కి వచ్చేలా ప్లానింగ్ ఉందట. నాగార్జున సినిమా అంటే ఎంటర్టైనింగ్, యాక్షన్, రొమాన్స్, కామెడీ అన్నీ ఉంటాయి.

నాగార్జున పాన్ ఇండియా అటెంప్ట్..

100వ సినిమా కాబట్టి నాగార్జున కూడా అలానే ప్లాన్ చేస్తున్నారట. సినిమా అనౌన్స్ మెంట్ తోనే ఒక గ్లింప్స్ వదిలి మూవీ మీద హై బజ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమాతో నాగార్జున పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తారన్న టాక్ నడుస్తుంది. ఒక డిఫరెంట్ అటెంప్ట్ తోనే నాగార్జున సెంచరీ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఫ్యాన్స్ తో పాటు నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని మెప్పించే కథ, కథనాలు ఇందులో ఉండేలా చూసుకుంటున్నారు.

దాదాపు ఏడాదికి పైగా నాగ్ తన 100వ సినిమా పనుల్లో ఉన్నారు. సరైన టైంకి సరైన ప్రమోషనల్ కంటెంట్ తో ఈ సినిమా ప్రకటించాలని చూస్తున్నారు. ఐతే నెక్స్ట్ ఇయర్ పొంగల్ కి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉందట. మరి సినిమా పై ఫ్యాన్స్ పెట్టుకున్న ఈ ఎక్స్ పెక్టేషన్స్ ని సినిమా అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

నాగార్జున స్టోరీ సెలక్షన్ ఎప్పుడూ డిఫరెంట్ గా ఉంటుంది. ఐతే మైల్ స్టోన్ మూవీ కాబట్టి కాస్త ఎక్కువ టైం తీసుకుంటున్నారని తెలుస్తుంది. సినిమా బడ్జెట్ వైజ్ కూడా భారీగా ఉండబోతుందని అంటున్నారు. సో పాన్ ఇండియా రేంజ్ లో సినిమా ఉండేలా నాగార్జున అండ్ టీం ప్లాన్ చేస్తున్నారట.

Tags:    

Similar News