NC 25 ఎవరితో ఉంటుంది..?

NC 24 సినిమా పూర్తి కాగానే ఏమాత్రం లేట్ చేయకుండా NC 25వ సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడట. ఐతే దానికోసమే కథల వేటలో పడినట్టు తెలుస్తుంది.;

Update: 2025-06-12 01:30 GMT

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తండేల్ తో ట్రెమండస్ హిట్ అందుకున్నాడు. చైతు కెరీర్ లో తండేల్ బెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా వసూళ్లు కూడా కెరీర్ బెస్ట్ గా నిలిచాయి. తండేల్ ఇచ్చిన ప్రోత్సాహంతో నాగ చైతన్య నెక్స్ట్ ఒక థ్రిల్లర్ మూవీతో రాబోతున్నాడు. నాగ చైతన్య 24వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్నారు. విరూపాక్ష తో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ దండు నెక్స్ట్ చైతుతో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా థ్రిల్లర్ సినిమాల్లో టాప్ అనేలా తెరకెక్కిస్తున్నారట. సినిమా షూటింగ్ మొదలైనప్పుడు రిలీజ్ చేసిన వీడియోతోనే అంచనాలు పెంచారు మేకర్స్. ఐతే ఎన్.సీ 24 పర్ఫెక్ట్ ప్లేస్ మెంట్ ఇంకా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నెక్స్ట్ నాగ చైతన్య ఎవరితో చేస్తాడన్నది తెలియాల్సి ఉంది. నాగ చైతన్య కెరీర్ ఇప్పుడు మంచి ఫాం లో ఉంది. తండేల్ తో కెరీర్ సెట్ రైట్ చేసుకున్న చైతు ఇక నెక్స్ట్ సినిమాలతో భారీ టార్గెట్ పెట్టుకుంటున్నాడు.

NC 24 సినిమా పూర్తి కాగానే ఏమాత్రం లేట్ చేయకుండా NC 25వ సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడట. ఐతే దానికోసమే కథల వేటలో పడినట్టు తెలుస్తుంది. ఇద్దరు ముగ్గురు దర్శకులు కథలు చెప్పగా అవంతగా ఇంప్రెస్ చేయలేదని టాక్. ఐతే ఒకప్పటిలా ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేస్తే ఆడియన్స్ చూస్తారన్న నమ్మకం లేదు. కచ్చితంగా గురి చూసి కొడితేనే అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుంది.

చైతన్య గత రెండు మూడు సినిమాల నుంచి అదే ప్లానింగ్ తో వస్తున్నాడు. తండేల్ తర్వాత కార్తీక్ ఎంపిక కూడా అందులో భాగమే అని తెలుస్తుంది. ఇక కార్తీక్ దండు తర్వాత ఏ డైరెక్టర్ ని పిక్ చేస్తాడన్నది చూడాలి. యువ దర్శకులంతా మంచి స్టోరీ టెల్లర్స్ గా వస్తున్నారు. సో మంచి అవకాశం ఎవరికి ఇచ్చినా తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునేలా కష్టపడుతున్నారు. మరి చైతు దృష్టిలో ఎవరు పడతారన్నది త్వరలో తెలుస్తుంది. కెరీర్ లో మంచి ఫేజ్ ని ఎంజాయ్ చేస్తున్న నాగ చైతన్య ఇలాంటి టైం లో అసలు కథల విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాడు.

Tags:    

Similar News