చై న్యూ లుక్: ఫిషర్‌మేన్ ఏంటి ఇలా మారాడు?
ఇంతకుముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ గా కనిపించాక, తన పాత్రతో పని పూర్తయ్యాక కొత్త ఫోటోషూట్ లో ట్రెండీ లుక్ లో కనిపించాడు. తనలోని స్టైలిష్ స్టార్ ని మళ్లీ ఎలివేట్ చేసాడు.;
మొన్ననే కదా ఫిషర్‌మేన్ లా మాసీగా కనిపించాడు నాగచైతన్య. `తండేల్` సినిమాలో ఎంతో నేచురల్ గా మత్స్యకార కుటుంబంలోంచి వచ్చిన యువకుడిగా అద్భుతంగా అభినయించాడు. ఇప్పుడు ఇంతలోనే ఇలా మారాడేమిటి? దేనికోసం ఈ మార్పు? అంటే.. కచ్ఛితంగా ఇది తనలోని వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకే. నిజానికి నాగచైతన్య క్లాస్ అప్పీల్ ఉన్న హీరో. అందువల్ల అతడు మాస్ లుక్ కి మారడానికి చాలా శ్రమించాడు. కానీ ట్రెంచ్ కోట్ లు, సెట్ పీస్ లు ధరించి మగువల గుండెల్లో మన్మధ బాణాలు గుచ్చే కుర్రాడిగా మారడానికి అతడు అంతగా శ్రమించనవసరం లేదు.
ఏది ఏమైనా, ఇప్పుడు చై ఇస్మార్ట్ లుక్ లోకి మారాడు. టాలీవుడ్ లో స్టైలిష్ లుక్ ఉన్నక అరుదైన హీరోల్లో చైతూ ఒకడు అని ఈ కొత్త ఫోటోషూట్ నిరూపించింది. స్టైల్.. సింప్లిసిటీ.. వైవిధ్యం ఈ మూడూ అతడి ఫ్యాషన్ సెన్స్ లో కనిపిస్తున్నాయి. ప్రస్తుత యూత్ చాలా ట్రెండీ లుక్ లో కనిపిస్తున్నారు. వారందరినీ మెప్పించాలంటే, చైతూలోని వెర్సటైలిటీని ఫోటోషూట్లతోనే ఆవిష్కరించాలి.
ఇప్పుడు అతడు మాస్ పాత్రలే కాదు.. క్లాస్ పాత్రలతోను దూసుకు రాగలడని మేకర్స్ కి పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇంతకుముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ గా కనిపించాక, తన పాత్రతో పని పూర్తయ్యాక కొత్త ఫోటోషూట్ లో ట్రెండీ లుక్ లో కనిపించాడు. తనలోని స్టైలిష్ స్టార్ ని మళ్లీ ఎలివేట్ చేసాడు. అదే తీరుగా ఇప్పుడు తండేల్ రాజు పాత్ర నుంచి బయటకు వచ్చి ఇలా కొత్తగా కనిపించేందుకు నాగచైతన్య ప్రయత్నించడం ఆకర్షిస్తోంది. కెరీర్ మ్యాటర్ కి వస్తే చైతూ ప్రస్తుతం కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తన 24వ చిత్రంలో నటిస్తున్నాడు.