చైతూ, సామ్ విడాకులు.. నాగ్ సిస్టర్ ఏమన్నారంటే?
విడాకులకు గల కారణాలపై రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పటివరకు ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు, సన్నిహితులు స్పందించలేదు.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ అండ్ క్యూట్ కపుల్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు అక్కినేని నాగచైతన్య, సమంత రూత్ ప్రభు. బ్లాక్ బస్టర్ హిట్ ఏమాయ చేసావే మూవీ సమయంలో ఫస్ట్ టైమ్ కలుసుకున్న చైతూ, సామ్ లవ్ లో పడ్డారు. కానీ ఆ తర్వాత వారిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎన్నో వార్తలు వచ్చినా ఎప్పుడూ స్పందించలేదు.
కానీ సడెన్ గా తాము ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో నాగచైతన్య- సమంత ఒక్కటయ్యారు. గోవాలో చాలా గ్రాండ్ గా హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వారిద్దరి వివాహ వేడుక జరిగింది. ఆ తర్వాత వైవాహిక జీవితాన్ని ఇద్దరూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన ఈవెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో సందడి చేశారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోతున్నారని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. కానీ అవి రూమర్సేనని అందరూ అనుకున్నారు. కానీ అదే నిజమైంది. తామిద్దరం విడిపోతున్నామని నాగచైతన్య, సమంత.. సోషల్ మీడియాలో వేర్వేరుగా ప్రకటించారు.
దీంతో సినీ ప్రియులు, ఫ్యాన్స్ చాలా నిరాశ వ్యక్తం చేశారు. విడాకులకు గల కారణాలపై రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పటివరకు ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు, సన్నిహితులు స్పందించలేదు. ఇప్పటి వరకు ఎక్కడా మాట్లాడలేదు. కొన్ని నెలల క్రితం అక్కినేని నాగార్జున సోదరి, చైతూ మేనత్త నాగసుశీల ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఆ ఇంటర్వ్యూ పాతదే అయినా ఇప్పుడు వీడియో వైరల్ గా మారింది. నాగార్జున, నాగచైతన్య, సుమంత్.. సినిమా నటులు కాబట్టి వారి ఫీల్డ్ లోని వ్యక్తులను పెళ్లి చేసుకున్నారని గుర్తు చేశారు. వారు తమ ఫీల్డ్ ను అర్ధం చేసుకుంటారని, కానీ అప్పుడు చైతన్యకు అలా జరిగిందని అన్నారు. ఆ విషయంలో ఇందులో మరొకరిని నిందించడానికి ఏం లేదని చెప్పారు.
ఎప్పుడైనా ఏం జరిగినా భార్యాభర్తలే కారణమని అన్నారు నాగసుశీల. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని, అయితే విడిపోవాల్సి వస్తే ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా విడిపోవడమే మంచిదని అన్నారు. ఎందుకంటే సమాజం కోసమో, ఫ్యామిలీ పరువు కోసమో ఇబ్బంది పడుతూ కలిసుండాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదని అన్నారు.
విడిపోయి ఇద్దరూ స్నేహితులుగా మిగిలిపోవచ్చని, అలాంటి వారిని ఎంతోమందిని చూశానని చెప్పుకొచ్చారు. కానీ కొన్ని జంటలు మాత్రం ఇంకా కొట్టుకుంటూ ఉన్నారని నాగసుశీల వ్యాఖ్యానించారు. ఇప్పుడు నాగసుశీల కామెంట్స్ బట్టి చూస్తే.. చైతూ, సామ్ కూడా ఇబ్బంది పడకుండా విడిపోయినట్లు కనిపిస్తుందని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.