• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వాయువ్ తేజ్ కోసం నాగబాబు...

వాయువ్ తేజ్ కోసం నాగబాబు నాటిన మొక్క ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

| మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ అయినా అభిమానుల్లో ఎంతో కుతూహలాన్ని పెంచుతుంది.

By - Madhu Reddy
Update: 2026-09-10 10:42 GMT

మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ అయినా అభిమానుల్లో ఎంతో కుతూహలాన్ని పెంచుతుంది. ముఖ్యంగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతుల ముద్దుల కుమారుడు వాయువ్ తేజ్ కొణిదెలకు సంబంధించిన వార్తలపై ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా నాగబాబు తన మనవడు వాయువ్ తేజ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైన ‘పునాస మామిడి’ చెట్టును నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు మనవడికి ఒక మరువలేని గిఫ్ట్ ఇచ్చేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

మనవడికి తాతయ్య ఇచ్చిన అమూల్యమైన బహుమతి:

పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా కుటుంబ సభ్యుల పుట్టినరోజులకు మొక్కలు నాటే మంచి సంప్రదాయాన్ని నాగబాబు కొనసాగిస్తున్నారు. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున కోకాపేటలో కదంబ వృక్షంతో పాటు 120కి పైగా మొక్కలు నాటారు. ఇప్పుడు మనవడి బర్త్‌డేకి మొక్క నాటే వీడియోను షేర్ చేస్తూ.. "నీకు ఎన్నో కాస్ట్లీ గిఫ్ట్‌లు ఇవ్వొచ్చు కానీ ఈ మొక్క చాలా ప్రత్యేకమైనది. నీకు 8 ఏళ్లు వచ్చేసరికి ఇది కాయలతో నిండిపోతుంది, అప్పుడు నీకు దీని విలువ అర్థమవుతుంది" అంటూ ఎంతో ఎమోషనల్ విషెస్ తెలియజేశారు.

ఏడాది పొడవునా కాసే ‘పునాస మామిడి’:

నాగబాబు నాటిన ఈ పునాస మామిడి దీనిని బారామాసి అని కూడా పిలుస్తారు ఒక అత్యంత అరుదైన భారతీయ మామిడి రకం. సాధారణంగా మామిడి కాయలు కేవలం వేసవి కాలంలో మాత్రమే వస్తాయి. కానీ ఈ పునాస మామిడి చెట్టు మాత్రం ఆఫ్-సీజన్‌లో కూడా ఏడాదికి అనేకసార్లు ఫలాలను ఇస్తుంది. ఆగస్టు, డిసెంబర్, జనవరి నెలల్లో కూడా ఈ చెట్టు నుంచి కాయలు కోసుకోవచ్చు.

రుచి, సైజ్ మరియు పెరటి పెంపక

ఈ పండు పరిమాణంలో చిన్నగా, గుండ్రంగా ఉండి, పండినప్పుడు ఎక్కువగా ఆకుపచ్చ లేదా పసుపు-ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు తింటే ఘాటైన పులుపు రుచితోను, పూర్తిగా పండినప్పుడు మితమైన పీచుతో చక్కటి తీపి రుచితోను భలేగా ఉంటుంది. ఈ చెట్లు చాలా చిన్న సైజులో పెరగడం వల్ల ఇళ్లలో పెరట్లో నాటుకోవడానికి, అలాగే డాబాలపై పెద్ద కుండీలలో పెంచడానికి ఎంతో పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.

పర్యావరణంతో కూడిన సరికొత్త సందేశం:

కేవల బొమ్మలు కాకుండా మనవడి భవిష్యత్తు కోసం చెట్టును నాటి నాగబాబు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. 'Happy 1st Birthday Vayuv' అంటూ ఆయన షేర్ చేసిన హార్ట్ టచింగ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాగబాబు ప్రేమాభిమానాలతో నాటిన ఈ పునాస మామిడి చెట్టుతో పాటే మనవడు వాయువ్ తేజ్ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఎదగాలని మెగా అభిమానులు మరియు నెటిజన్లు ఆశీర్వదిస్తున్నారు.



Happy 1st Birthday, my precious grandson #Vayuv❤️
In your tiny hands, I see the future,in your innocent smile, I feel the universe’s purest joy. You are the light that brightens our days, the blessing that makes life complete. May your journey be filled with love, laughter, and… pic.twitter.com/AGPgAfeBJB

— Naga Babu Konidela (@NagaBabuOffl) September 10, 2026


Tags:    
  • nagababu 
  • vayuvtej 
  • megafamily 
  • varuntej 

Similar News

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS