నాగవంశీలో అంత ఛేంజ్ వచ్చిందా?
ఒకప్పుడు స్టేజ్ పైకి రావాలన్నా భయపడేవారు. మైక్ చేతిలో పెట్టినా రెండు మాటలు చెప్పడానికి ఇబ్బంది పడేవారు.
ఒకప్పుడు స్టేజ్ పైకి రావాలన్నా భయపడేవారు. మైక్ చేతిలో పెట్టినా రెండు మాటలు చెప్పడానికి ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి సినిమా ఈవెంట్లలో మెయిన్ అట్రాక్షన్ గా మారుతున్నారు. తన మాటలతో అభిమానులను అలరిస్తూనే, సినిమాలపై తన అభిప్రాయాలను నేరుగా చెప్పే నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ వ్యక్తే సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ. తాజాగా లెనిన్ బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్ లో నాగచైతన్య చేసిన కామెంట్స్ నాగవంశీ జర్నీని మరోసారి హైలైట్ చేశాయి.
అఖిల్ హీరోగా నాగవంశీ నిర్మించిన లెనిన్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఆ సందర్భంగా మూవీ టీమ్ నిర్వహించిన లెనిన్ బ్లాక్ బస్టర్ వైభవం వేడుకలో అక్కినేని కుటుంబం మొత్తం సందడి చేసింది. అఖిల్ తో పాటు నాగార్జున, నాగచైతన్య కూడా హాజరయ్యారు. ముగ్గురు అక్కినేని హీరోలు ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ లో స్పెషల్ జోష్ కనిపిచింది. ఆ వేడుకలో మాట్లాడిన నాగచైతన్య, నాగవంశీ గురించి చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.
"వంశీ ఒకప్పుడు ఎలా ఉండేవాడో.. స్టేజ్ పైకి పిలిచి రెండు మాటలు మాట్లాడమంటే సిగ్గుపడేవాడు.. కానీ ఇప్పుడు చింటూ అన్న అంటున్నారు.. ఏదోదో అంటున్నారు.. అదే సమయంలో వంశీ ఏ మూవీ చేసినా.. ఆ సినిమాకు పెట్టిన డబ్బులు వస్తున్నాయా రాట్లేదా అనేది పక్కన పెట్టి.. ఒక హీరోను ఎలా ప్రొజెక్ట్ చేయాలో.. వంశీకి తెలుసు. అదే ఇప్పుడు తమ్ముడు ఇవ్వడం హ్యాపీగా ఉంది.. థ్యాంక్యూ సో మచ్ వంశీ" అని నాగచైతన్య అన్నారు.
చైతూ మాటల్లో ఫన్ ఉన్నప్పటికీ, అందులో నాగవంశీ డెవలప్మెంట్ పై ఉన్న ప్రశంస కూడా క్లియర్ గా కనిపించింది. నిర్మాతగా మాత్రమే కాకుండా, ఒక సినిమాను ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్లాలి, హీరో ఇమేజ్ ను ఎలా బలపరచాలనే విషయంలో నాగవంశీకి అవగాహన ఉందనే భావన ఇండస్ట్రీలో చాలామందికి ఉంది. 2017 నుంచి సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై వరుస సినిమాలు నిర్మిస్తూ వచ్చిన నాగవంశీ, తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఎదిగారు.
అరవింద సమేత వీర రాఘవ, జెర్సీ, అల వైకుంఠపురములో, భీమ్లా నాయక్, లక్కీ భాస్కర్ వంటి అనేక బ్లాక్ బస్టర్ హిట్ మూవీలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే నాగవంశీని ప్రత్యేకంగా నిలబెట్టింది ఆయన నిర్మించిన సినిమాలే కాదు. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపై ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడే తీరు కూడా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. అందుకే ఆయన వ్యాఖ్యలు, ఆయన పాల్గొనే ఈవెంట్లు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
ఇప్పుడు లెనిన్ విజయం తర్వాత నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు మరోసారి నాగవంశీ మార్పును చర్చకు తెచ్చాయి. ఒకప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి కూడా ఇష్టపడని వ్యక్తి.. ఇప్పుడు స్టార్ హీరోలతో సమానంగా చర్చల్లో నిలుస్తున్నారు. అందుకే నాగవంశీలో నిజంగానే అంత పెద్ద ఛేంజ్ వచ్చిందా? లేక ఆయనలో ఉన్న స్టామినాను ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారా? అనే ప్రశ్న వినిపిస్తోంది.