'సుప్రియను హింస పెట్టినందుకు థ్యాంక్స్'.. నాగవంశీ ఫన్నీ ర్యాగింగ్!
టాలీవుడ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే కేవలం సినిమా ప్రమోషన్ మాత్రమే కాదు, కొన్నిసార్లు సరదా కామెంట్స్ తో నిండిపోతుంటాయి.;
టాలీవుడ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే కేవలం సినిమా ప్రమోషన్ మాత్రమే కాదు, కొన్నిసార్లు సరదా కామెంట్స్ తో నిండిపోతుంటాయి. తాజాగా డెకాయిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అలాంటి ఫన్నీ మూమెంట్స్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా నిర్మాత నాగవంశీ.. డెకాయిట్ ప్రొడ్యూసర్ సుప్రియపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుప్రియ యార్లగడ్డ.. తాజాగా ఎస్ ఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై డెకాయిట్ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించగా, షానియల్ డియో దర్శకత్వం వహించారు. యాక్షన్, లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఆ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా హాజరైన నాగవంశీ, సుప్రియపై సరదాగా ర్యాగింగ్ చేస్తూ మాట్లాడారు. "సుప్రియ గారు ఎప్పుడూ మమ్మల్ని క్లాస్ పీకుతుంటారు. సినిమాలు ఇంత ఖర్చుతో ఎందుకు తీస్తారు, ఇన్ని రోజులు ఎందుకు పడుతుందని అనేవారు. కానీ ఇప్పుడు ఆమె రెండు సంవత్సరాలు కష్టపడి డెకాయిట్ తీశారు. దాంతో మేమంతా ఆ విషయాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆమెను బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ లా కామెంట్ చేస్తున్నాం" అంటూ నాగవంశీ సరదాగా అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, "మేం విష్ చేసే కన్నా వెక్కిరిద్దామని వచ్చాం. డెకాయిట్ సినిమా కోసం మొత్తం 147 వర్కింగ్ డేస్ పని చేశారు సుప్రియ. కాబట్టి ఇకపై మమ్మల్ని ఎవరినీ తిట్టే హక్కు ఆమెకు లేదనుకుంటా. ముఖ్యంగా ఆమెకు ప్రొడ్యూసర్ కష్టాలు ఏంటో చూపించినందుకు అడివి శేష్ గారికి నేను చాలా థాంక్స్" అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.
"ఆవిడ ఊరికే హీరోలందరినీ నెత్తికి ఎక్కించుకుంటున్నారని క్లాసులు పీకుతారు. రెండు సంవత్సరాలు ఆవిడని హింస పెట్టినందుకు శేష్ కు చాలా థాంక్స్. బయట హీరోలతో సినిమాలు తీస్తే ఎంత కష్టమో ఇప్పుడు తెలిసి ఉంటుంది" అని అన్నారు. అంతేకాకుండా, "బయట హీరోలతో సినిమాలు తీస్తే ఎంత కష్టంగా ఉంటుందో కూడా తెలియాలి కదా. ఇప్పటివరకు వాళ్ల తమ్ముళ్లతో, వాళ్ల మామయ్య గారితో సినిమాలు తీసి ఏం నొప్పి తెలియలేదు. ఇప్పుడు తెలుస్తుంది" అని నవ్పుతూ చెప్పారు.
చివరగా నాగవంశీ, సుప్రియ మమ్మల్ని క్లాస్ పీకినా, సినిమా కోసం పెట్టిన కష్టానికి ఫలితం రావాలని ఆకాంక్షించారు. డెకాయిట్ మూవీ మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాట్లు తెలిపారు. ఇకపై బయట హీరోలతో సినిమాలు తీసి తమలాగే కష్టపడాలని ఆశిస్తున్నానట్లు కామెడీ చేశారు. అలా సరదాగా చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని నవ్వుల్లో ముంచెత్తగా, సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతున్నాయి.