నాగ‌వంశీకి ఆ విష‌యం ముందే తెలుసా?

కొన్ని సినిమాలు స్టోరీ ద‌శ‌లోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతాయ‌ని స్ప‌ష్టం చేస్తాయి. మ‌రి కొన్ని సినిమాలు మేకింగ్ ద‌శ‌లో ఆ ఇండికేష‌న్స్ అందిస్తాయి.;

Update: 2025-12-30 11:01 GMT

కొన్ని సినిమాలు స్టోరీ ద‌శ‌లోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతాయ‌ని స్ప‌ష్టం చేస్తాయి. మ‌రి కొన్ని సినిమాలు మేకింగ్ ద‌శ‌లో ఆ ఇండికేష‌న్స్ అందిస్తాయి. కొన్ని రిలీజ్ ద‌శ‌కు వ‌చ్చే స‌మ‌యానికి అంత‌గా ఆక‌ట్టుకోలేవ‌ని సంకేతాలిస్తాయి. అయినా స‌రే మార్చే వీలు లేక‌.. చివ‌రి క్ష‌ణంలో చేసేది ఏమీ లేక అలాగే రిలీజ్ చేసి చేతులు కాల్చుకున్న వారు ఎంతో మంది ఇండ‌స్ట్రీలో ఉన్నారు. ఇదే త‌ర‌హా ప‌రిస్థితి యంగ్ ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీకి ఎదురైంద‌ట‌. వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌ని నిర్మిస్తూ విజ‌యాల్ని అందుకుంటున్నారాయ‌న‌.

అయితే అందులో కొన్ని మిస్ ఫైర్ అవుతున్నాయి కూడా. వివ‌రాల్లోకి వెళితే.. రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన మూవీ `కింగ్‌డ‌మ్‌`. గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2025, జూలై 31న విడుద‌లై ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక‌పోయింది. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్‌లోని ఫ‌స్ట్ పార్ట్‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. అందులో స‌గాన్ని కూడా రాబ‌ట్ట‌లేక‌పోయింది. కెరీర్ ప‌రంగా గ‌త కొంత కాలంగా డ‌ల్ ఫేజ్‌ని ఎదుర్కొంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావాల‌ని భావించాడు.

ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు పెట్టుకుని చేశాడు. కానీ ఫ‌లితం మాత్రం తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. నిర్మాత‌ల‌ని కూడా నష్టాల‌ని తెచ్చి పెట్టింది. ఇదే విష‌యాన్ని నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ వెల్ల‌డించారు. సినిమా ఏ విష‌యంలో మిస్ ఫైర్ అయిందో స్ప‌ష్టం చేశారు. సినిమా రిలీజ్‌కు వారం ముందే `కింగ్‌డ‌మ్‌` మా ఎక్స్‌పెక్టేష‌న్స్‌ని రీచ్ కాలేద‌ని అర్థ‌మైంది. గౌత‌మ్ ప్ర‌ధాన బ‌లం భావోద్వేగం. కానీ రెండ‌వ భాగం ఆశించిన భావోద్వేగాల‌ని అనుకున్న స్థాయిలో పండించ‌లేక‌పోయింది.

అదే సినిమాకు ప్ర‌ధాన మైన‌స్‌గా మారి ఫ‌లితాన్ని తారుమారు చేసింద‌ని చెప్పుకొచ్చారు. గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ట్ చేసిన `జెర్సీ` భావోద్వేగాల స‌మాహారంగా సాగి బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే అవే ఎమోష‌న్స్ `కింగ్‌డ‌మ్‌`లో లోపించ‌డం వ‌ల్లే సెకండ్ హాఫ్ అంత‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింద‌నే కామెంట్‌లు సినిమా రిలీజ్ టైమ్‌లో వినిపించాయి. అదే విష‌యాన్ని ఇన్నాళ్లకు నిర్మాత సూర్య‌దేవ‌ర నాగవంశీ వ్య‌క్తం చేయ‌డంతో పార్ట్ 2 ని అందుకే ర‌ద్దు చేశార‌నే కామెంట్‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

సూర్య‌దేవ‌ర నాగవంశీ ప్ర‌స్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ సూర్య క‌థానాయ‌కుడిగా వెంకీ అట్లూరి డైరెక్ష‌న్‌లో ఓ భారీ మూవీని చేస్తున్నాడు. దీనితో పాటు తాజాగా స్టార్ బాయ్ సిద్దూతో మ‌రో ప్రాజెక్ట్‌కు శ్రీ‌కారం చుట్టాడు. ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌` ఫేమ్ స్వ‌రూప్ ఆర్ ఎస్ జె దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌ని మంగ‌ళ‌వారం మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Tags:    

Similar News