వృషకర్మకు అసలు పని ఇప్పుడే!

ఇక లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ నాగచైతన్య లుక్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చైతూ కెరీర్‌లో ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు.

Update: 2026-09-10 15:28 GMT

వృషకర్మ డిసెంబర్ 4న రానున్నట్లు రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్. నాగచైతన్య తన పోర్షన్ షూటింగ్ కూడా పూర్తి చేశాడు. అంటే ఇక ఆయన సెట్లోకి వెళ్లాల్సిన పని దాదాపుగా అయిపోయింది. కానీ ఈ సినిమా విషయంలో అసలు టైమ్ తీసుకునేది ఇప్పుడు మొదలయ్యే పని. మైథాలజీ, మిస్టరీ, అడ్వెంచర్ సినిమా కావడంతో వీఎఫ్ఎక్స్‌కు చాలా వర్క్ ఉంటుంది. అందుకే రిలీజ్‌కు ఇంకా మూడు నెలలు ఉన్నా టీమ్ ముందుగానే పోస్ట్ ప్రొడక్షన్ మీద పూర్తి ఫోకస్ పెట్టింది.



 


ఇక లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ నాగచైతన్య లుక్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చైతూ కెరీర్‌లో ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. తండేల్‌లో రియల్ బ్యాక్‌డ్రాప్, ఎమోషన్‌తో వెళ్లిన అతను ఇప్పుడు పూర్తిగా మిస్టరీ వెనుక పరుగెత్తే క్యారెక్టర్ చేస్తున్నాడు. పోస్టర్లు, గ్లింప్స్‌లో కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఫీల్ లేదు. చేతిలో ఆయుధం, వెనుక మైథాలజీ టచ్‌తో వేరే ప్రపంచాన్ని చూపిస్తున్నారు. చైతూ లుక్ కూడా అందుకు తగ్గట్టుగానే మార్చారు. ముఖ్యంగా తండేల్ తర్వాత మళ్లీ అదే తరహా కథ చేయకుండా, కొత్త జానర్ వైపు వెళ్లడం హైలెట్.

కార్తీక్ దండు విరూపాక్షలో హారర్, మిస్టరీని ఒక ఊరి కథతో కలిపి మంచి రిజల్ట్ అందుకున్నాడు. రెండో సినిమాకే అతనికి పెద్ద కాన్వాస్ దొరికింది. వృషకర్మలో మాత్రం ఆ స్కేల్ మరింత పెరిగింది. సుకుమార్ రైటింగ్స్ కూడా ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో కథ, స్క్రీన్‌ప్లే షాక్ ఇచ్చేలా ఉంటుందని టాక్ వస్తోంది. ఇక అంతర్జాతీయ స్థాయి స్టూడియోలలో వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోందని టీమ్ చెబుతోంది.

ఇలాంటి సినిమాల్లో షూట్ చేసిన విజువల్స్ కంటే ఫైనల్ అవుట్‌పుట్‌లో కనిపించే ప్రపంచమే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందుకే డిసెంబర్ 4 డేట్ ప్రకటించిన తర్వాత టీమ్ ముందు ఉన్న పెద్ద పని ఈ మూడు నెలల్లో ఆ గ్రాఫిక్స్‌ను అనుకున్న స్థాయికి తీసుకురావడమే. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో కనిపించనున్నారు.

అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్‌కు తగ్గట్టుగానే రెడీ అవుతోంది. ఇప్పటి నుంచి ప్రమోషన్స్ కూడా పెంచే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. టీజర్, పాటలు, ఇతర ప్రమోషనల్ మెటీరియల్‌ను వరుసగా సిద్ధం చేసే అవకాశం ఉంది. డిసెంబర్ 4కు ముందు సినిమాపై ఉన్న మైథాలజీ మిస్టరీని ఎంత వరకు బయటపెడతారన్నది చూడాలి. ఇప్పటివరకు కథను ఎక్కువగా ఓపెన్ చేయకుండా వచ్చారు. ఇక వృషకర్మ టీమ్, ఇక నుంచి ఏ పాయింట్‌ను ముందుకు తీసుకొస్తుందో.

Tags:    

Similar News