కంటెంట్ ఉన్న దర్శకుడితో అక్కినేని న్యూ కాంబో!
టాలీవుడ్‌లో మాస్ యాక్షన్, స్పై థ్రిల్లర్ సినిమాల మీద ఫుల్ ఫోకస్ పెరుగుతుండగా.. నాగచైతన్య కూడా అదే ట్రాక్ ఫాలో అవుతాడని తాజా సమాచారం.;
యూవసామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం వరుసగా డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను స్థిరపరుచుకుంటున్నాడు. ఇటీవల తండేల్ సక్సెస్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన చై ప్రస్తుతం మైథలాజికల్ థ్రిల్లర్ NC24తో బిజీగా ఉన్నాడు. ఇక ఆ ప్రాజెక్ట్ తర్వాత చేసే సినిమా ఏంటన్నది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అందుకు సంబంధించిన ఇంట్రస్టింగ్ బజ్ బయటకు వచ్చింది.
టాలీవుడ్‌లో మాస్ యాక్షన్, స్పై థ్రిల్లర్ సినిమాల మీద ఫుల్ ఫోకస్ పెరుగుతుండగా.. నాగచైతన్య కూడా అదే ట్రాక్ ఫాలో అవుతాడని తాజా సమాచారం. తాజాగా ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. చైతన్య తన నెక్స్ట్ మూవీకి బ్లాక్‌బస్టర్ తమిళ డైరెక్టర్ పీఎస్ మిత్రన్‌తో చేతులు కలపబోతున్నాడు.
సర్దార్, అభిమన్యు, హీరో వంటి సినిమాలతో తమిళనాట తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న మిత్రన్.. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ తెలుగులో నాగచైతన్యతో ఉంటుందని ఇండస్ట్రీ టాక్. ఈ మాస్ యాక్షన్ డ్రామాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుంది. ఇంతకుముందు ఈ సంస్థలో అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా వచ్చింది.
ఇప్పటికే మిత్రన్ ‘సర్దార్ 2’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా డ్యుయల్ రోల్‌లో కార్తీ నటించబోతున్నారు. అయితే సర్దార్ 2 తర్వాత స్టార్ట్ చేసే సినిమా నాగచైతన్యతోనే ఉండబోతుందని ఫిక్స్ అయ్యిందట. కథ, స్క్రీన్‌ప్లే రచన ఇప్పటికే రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్పై డ్రామా కానుందని టాక్. ఇక భారీ మేకింగ్, యాక్షన్ ఎలిమెంట్స్ కలిపి డిజైన్ చేస్తున్నారట.
ఈ ప్రాజెక్ట్‌లో నాగచైతన్యకి పూర్తి స్థాయి మార్పు కనిపిస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. యాక్షన్ హీరోగా కొత్తగా కనిపించే ప్రయత్నమే ఇది. సరికొత్త బ్యాక్‌డ్రాప్, ఇంటెలిజెన్స్ టచ్‌తో స్క్రిప్ట్ రెడీ అవుతోందట. మొత్తానికి నాగచైతన్య, మిత్రన్ కాంబో సినిమా చర్చ మొదలైన దగ్గర నుంచే ఫ్యాన్స్ లో భారీ బజ్ మొదలైంది. ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ.. వచ్చే నెలలో అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.