అప్డేట్లు లేకపోవడం వెనుక అసలు ట్విస్ట్ ఇదేనా?

నాగచైతన్య- కార్తిక్ దండు కాంబినేషన్‌లో రూపొందుతున్న మిస్టిక్ హారర్ థ్రిల్లర్ కూడా అదే ర‌కమైన స్ట్రాట‌జీని ఫాలో అవుతూ డిస్క‌ష‌న్ కు కారణమైంది.

Update: 2026-08-14 02:30 GMT

సినిమా ప్రచారం అంటే ఒకప్పుడు ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్, ట్రైలర్, ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో రెగ్యుల‌ర్ హడావుడి కనిపించేది. కానీ ఇటీవల కొన్ని పెద్ద ప్రాజెక్టులు పూర్తిగా భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. మొద‌లైన‌ప్పుడు ఒక చిన్న టీజర్ లేదా కాన్సెప్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసి, ఆ తర్వాత చాలా కాలం ఎలాంటి అప్డేట్లు ఇవ్వకుండా ఉండటం ఇప్పుడు కొత్త మార్కెటింగ్ ట్రెండ్‌గా మారుతోంది. నాగచైతన్య- కార్తిక్ దండు కాంబినేషన్‌లో రూపొందుతున్న మిస్టిక్ హారర్ థ్రిల్లర్ కూడా అదే ర‌కమైన స్ట్రాట‌జీని ఫాలో అవుతూ డిస్క‌ష‌న్ కు కారణమైంది.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మొద‌టి విజువల్ మెటీరియల్ రిలీజైన తర్వాత ఫ్యాన్స్ వరుస అప్డేట్లను ఆశించారు. అయితే నెలలు గడిచినా సినిమా నుంచి పెద్దగా ప్రమోష‌న్స్ కనిపించలేదు. దీంతో ప్రాజెక్ట్ పురోగతిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇండ‌స్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌కు, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నట్లు డిస్క‌ష‌న్ నడుస్తోంది. మిస్టిక్ హారర్ జానర్‌లో వాతావరణం, విజువల్ డిజైన్, సౌండ్ ఎలిమెంట్స్ కీలకం కావడంతో మేకర్స్ తొందరపడకుండా పనులు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక్కడ మ‌రో ఇంట్రెస్టింగ్ అంశం ఉంది. అప్డేట్లు ఆలస్యం కావడం ప్రతి సారి నెగెటివ్ సిగ్నల్ కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అదే క్యూరియాసిటీని పెంచే సాధనంగా మారుతుంది. ఆడియ‌న్స్ కు ప్రతి వారం కొత్త పోస్టర్ లేదా వీడియో ఇవ్వకుండా, సినిమా గురించి మాట్లాడుకునే స్పేస్‌ను సోషల్ మీడియాకే వదిలేయడం కూడా ఒక మార్కెటింగ్ పద్ధతిగా మారుతోంది. ముఖ్యంగా మిస్టరీ, హారర్, థ్రిల్లర్ జానర్లలో ఎక్కువ సమాచారం బయటకు రాకపోవడం ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతుంది.

నాగచైతన్య కెరీర్ పరంగా కూడా ఇది ఆసక్తికర దశ అనే చెప్పుకోవాలి. కమర్షియల్, రొమాంటిక్ కథల తర్వాత భిన్నమైన జానర్ల వైపు అడుగులు వేస్తున్న చైతూకి ఈ సినిమా ఇమేజ్ పరంగా కీలకంగా మారే అవకాశం ఉంది. మరోవైపు దూత సెకండ్ సీజన్ వ‌ర్క్స్ కూడా వేగంగా సాగుతున్నాయి. అంటే థియేట్రికల్ మార్కెట్‌తో పాటు ఓటీటీ ఆడియ‌న్స్ న కూడా చైతూ సమాంతరంగా టార్గెట్ చేస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతుంది.

డిసెంబర్ రిలీజ్ టార్గెట్ గా పనులు కొనసాగుతున్నాయనే ప్రచారం మధ్య, అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్స్ కంటే ఈ సైలెన్స్‌నే ఇప్పుడు సినిమా బలంగా మార్చే ప్రయత్నం జరుగుతోందా అనే చర్చ పరిశ్రమలో వినిపిస్తోంది. రిలీజ్ డేట్ ను ఒకేసారి అనౌన్స్ చేస్తే ఆ గ్యాప్ వల్ల ఏర్పడిన క్యూరియాసిటీ సినిమాకు అదనపు బజ్ తీసుకురావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం చూస్తుంటే, ఓవర్ ప్రమోషన్ కంటే కంట్రోల్డ్ సైలెన్స్ కూడా ఒక మార్కెటింగ్ టూల్‌గా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News