మైల్ స్టోన్ సినిమాలకు రిస్క్ చేస్తున్న తండ్రీ కొడుకులు
గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపులతో సతమతమైన నాగ చైతన్యకు తండేల్ సినిమా ఇచ్చిన రిలీఫ్ అంతా ఇంతా కాదు.;
గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపులతో సతమతమైన నాగ చైతన్యకు తండేల్ సినిమా ఇచ్చిన రిలీఫ్ అంతా ఇంతా కాదు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తండేల్ సక్సెస్ ఇచ్చిన జోష్ లో నాగ చైతన్య తన తర్వాతి సినిమాను విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.
చైతన్య కెరీర్ లో 24వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా విరూపాక్ష లానే మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతుండగా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మీనాక్షి చౌదరి NC24లో హీరోయిన్ గా నటిస్తున్నారు.
అయితే NC24 పూర్తయ్యాక చైతూ చేయబోయే సినిమా విషయంలో నాగ చైతన్య తన తండ్రిని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. అవును నిజమే. కుబేర సినిమాతో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న నాగార్జున, ఆగస్టులో కూలీ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. కానీ ఈ రెండు సినిమాల్లోనూ నాగార్జున హీరో కాదు, నా సామిరంగ తర్వాత నాగ్ సోలో హీరోగా మరో సినిమాను చేసింది లేదు.
నాగ్ సోలో హీరోగా చేయనున్న తర్వాతి సినిమాకు తమిళ డైరెక్టర్ రా. కార్తీక్ దర్శకత్వం వహించనున్నారని ఇప్పటికే వార్తలొచ్చాయి. ఆల్రెడీ డిస్కషన్స్ జరిగాయని, ఆగస్టు లో నాగార్జున బర్త్ డే సందర్భంగా సినిమాను అనౌన్స్ చేస్తారని అంటున్నారు. అయితే ఇప్పుడు నాగ చైతన్య కూడా తన తర్వాతి సినిమా విషయంలో తండ్రి బాటలోనే వెళ్తున్నట్టు తెలుస్తోంది.
NC24 పూర్తయ్యాక చైతూ ఓ తమిళ డైరెక్టర్ తో సినిమా చేయడానికి జత కడుతున్నారని తెలుస్తోంది. తమిళంలో పలు థ్రిల్లర్ సినిమాలు చేసి మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పి.ఎస్ మిత్రనే ఆ డైరెక్టర్. ప్రస్తుతం కార్తీతో సర్దార్ కు సీక్వెల్ గా సర్దార్2 చేస్తున్న పి.ఎస్ మిత్రన్ తో తర్వాతి సినిమాను నాగ చైతన్యతో చేయనున్నారని, దానికి సంబంధించే చైతూతో డిస్కషన్స్ చేస్తున్నారని, చైతూతో చేయబోయే సినిమా కూడా థ్రిల్లర్ నేపథ్యంలోనే తెరకెక్కనుందని అంటున్నారు. అయితే గత కొంత కాలంగా టాలీవుడ్ హీరోలు తమిళ డైరెక్టర్లతో ఎలాంటి సినిమాలు చేసినా అవి ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోతున్న సంగతి తెలిసిందే. గతంలో చైతూ కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో కస్టడీ మూవీ చేయగా ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ నాగార్జున, నాగ చైతన్య తమిళ డైరెక్టర్లనే నమ్ముకుని వారికి తమ మైల్ స్టోల్ సినిమాలైన నాగ్100, చైతూ25 ను ఇస్తున్నారని తెలిసి అందరూ తండ్రీ కొడుకులు ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నారని అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.