చైతూ దూత 2.. ఈసారి ఇంకాస్త కొత్తగా.. బాధ్యతగా..

అక్కినేని నాగ చైతన్య డిజిటల్ ప్లాట్ ఫామ్ పై మొదటిసారి 'దూత' వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఆ సీరీస్ కు మంచి గుర్తింపు దక్కింది.

Update: 2026-06-05 09:49 GMT

అక్కినేని నాగ చైతన్య డిజిటల్ ప్లాట్ ఫామ్ పై మొదటిసారి 'దూత' వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఆ సీరీస్ కు మంచి గుర్తింపు దక్కింది. ఇక ఈ థ్రిల్లర్ ప్రాజెక్టు రెండో భాగం మొదలైంది. మొదటి సీజన్ తో ఓటీటీలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న చైతూ, ఈ సెకండ్ పార్ట్ తో కొత్త బాధ్యతను భుజాన వేసుకున్నాడు. 'దూత 2' షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కాగా, ఈ ప్రాజెక్ట్ తో తను నిర్మాతగా మారుతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చాడు.



 


ఒక నటుడిగా తనను తాను కొత్తగా హైలెట్ చేసుకున్న ప్రాజెక్ట్ తోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం స్పెషల్. హీరోలు నిర్మాతలుగా మారినప్పుడు సొంత బ్యానర్ పైనే ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. కానీ చైతన్య తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రొడక్షన్ బ్రాండ్ క్రియేట్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో కలిసి నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు తను కూడా భాగస్వామి కావడం చూస్తుంటే అతనికి నమ్మకం గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతుంది.



 


డిజిటల్ మార్కెట్ స్కోప్ ను పసిగట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పర్ఫెక్ట్ ప్లానింగ్ అని చెప్పాలి. యాక్టింగ్ మాత్రమే కాకుండా కంటెంట్ క్రియేషన్ లో ముద్ర వేయాలని చైతూ ఫిక్స్ అయ్యాడు. ఈ సిరీస్ పూజా కార్యక్రమాలకు కింగ్ నాగార్జున ప్రత్యేక అతిథిగా హాజరై సందడి చేశారు. కొడుకు మొదలుపెడుతున్న తొలి ప్రాజెక్ట్ కావడంతో స్వయంగా వచ్చి స్క్రిప్ట్ ను డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కు అందించి టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.



 


మొదటి సీజన్ లో ఆకట్టుకున్న పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ లాంటి నటీమణులు ఈ సీక్వెల్ లో కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగ్ రాకతో సెట్స్ లో పాజిటివ్ ఎనర్జీ కనిపించిందని ప్రియా భవానీ శంకర్ తన ఖాతాలో రాసుకొచ్చింది. డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ మేకింగ్ స్టైల్ గురించి ఆడియన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక థ్రిల్లర్ ను టెన్షన్ తగ్గకుండా నడపడంలో అతను దిట్ట. దూత మొదటి భాగంలో జర్నలిజం క్రైమ్ పాయింట్ తో ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టాడు.



 


ఇప్పుడు దానికి కొనసాగింపుగా రాబోతున్న ఈ రెండో భాగంలో కథను ఏ రేంజ్ లో డీల్ చేయబోతున్నాడనే ఆసక్తి నెలకొంది. నాగ చైతన్యతో అతనికి ఉన్న సింక్ ఈ సిరీస్ కు ప్రధాన బలం అని చెప్పవచ్చు. పైగా అక్కినేని వారికి మనం అనే గోల్డెన్ హిట్ ఇచ్చిన అనుబంధం ఉంది. ఇక చైతన్య కెరీర్ గ్రాఫ్ ను గమనిస్తే దూత సిరీస్ తో పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు క్లాస్ ఆడియన్స్ కే పరిమితమైన చైతూ, ఇంటెన్స్ డార్క్ రోల్స్ కూడా తాను పండించగలడని నిరూపించాడు. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ తో ఏకంగా నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకోవడం మరో హైలెట్. రాసుకున్న కథ మీద, డైరెక్టర్ విజన్ మీద ఉన్న నమ్మకమే అతన్ని సొంతంగా డబ్బులు పెట్టే స్థాయికి తీసుకువచ్చిందని ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ కామెంట్స్ అందుతున్నాయి. ఒక మంచి ముహూర్తంలో ప్రారంభమైన ఈ షూటింగ్ శరవేగంగా జరగనుంది. కొత్త రోల్ లో అడుగుపెట్టిన చైతన్యకు ఈ సిరీస్ కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.



 




 


Tags:    

Similar News