తండేల్ కాంబో మరో ప్రాజెక్ట్..?

ఐతే చందు మొండేటి హీరోల లిస్ట్ లో తెలుగు, తమిళ స్టార్స్ ఉన్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే చందు మొండేటి మళ్లీ నాగ చైతన్యతోనే సినిమా చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారని టాక్.;

Update: 2025-06-26 03:45 GMT

హీరో, డైరెక్టర్ కాంబో హిట్ పడింది అంటే ఆ కాంబినేషన్ లో మరో సినిమా చేయడం కామన్. అలాంటి కాంబో సినిమా వస్తే ఆడియన్స్ లో కూడా ఒక స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. అలాంటి ఒక సూపర్ హిట్ కాంబో మళ్లీ సినిమా చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ ఎవరా హీరో, డైరెక్టర్ అంటే అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య, డైరెక్టర్ చందు మొండేటి అని తెలుస్తుంది. అంతకుముందు ఇద్దరు కలిసి సవ్యసాచి, ప్రేమం సినిమాలు చేశారు. ఐతే హ్యాట్రిక్ సినిమా తండేల్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

ఒక సినిమా సెట్స్ మీద నుంచి పాజిటివ్ బజ్ ఏర్పరిస్తే అది పక్కా సూపర్ హిట్ అవుతుందని ప్రూవ్ చేసిన సినిమా తండేల్. సినిమా షూటింగ్ దశలోనే తండేల్ హిట్ అనే టాక్ వచ్చింది. చందు, నాగ చైతన్య కాంబో అలా క్లిక్ అయ్యింది. ఐతే ఈ సినిమా తర్వాత నాగ చైతన్య నెక్స్ట్ విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో సినిమా లాక్ చేసుకున్నాడు. తండేల్ తర్వాత నాగ చైతన్య సినిమా ఓకే అవ్వగా చందు నెక్స్ట్ సినిమా ఏంటన్నది క్లారిటీ రాలేదు.

ఐతే చందు మొండేటి హీరోల లిస్ట్ లో తెలుగు, తమిళ స్టార్స్ ఉన్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే చందు మొండేటి మళ్లీ నాగ చైతన్యతోనే సినిమా చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారని టాక్. ఎలాగు తండేల్ హిట్ ఇచ్చాడు కాబట్టి చందు తో సినిమా అంటే నాగ చైతన్య కాదనే ఛాన్స్ లేదు. అందుకే మరో అద్భుతమైన కథతో చందు నాగ చైతన్య కలుస్తున్నారని తెలుస్తుంది.

నాగ చైతన్య కూడా కార్తీక్ దండు సినిమా పూర్తి కాగానే వెంటనే మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లానై చూస్తున్నాడు. అక్కినేని హీరోల్లో వరుస సినిమాలు చేస్తూ వాటితో హిట్లు కొడుతూ కెరీర్ లో దూకుడు చూపిస్తున్నాడు నాగ చైతన్య. తప్పకుండా చందుతో మరో సినిమా ఉంటే మాత్రం అతనికి మరో సూపర్ హిట్ దక్కుతుందని చెప్పొచ్చు. నాగ చైతన్య కూడా ఇక మీదట కంటెంట్ ఉన్న సినిమాలనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే అతనికి వరుస సక్సెస్ లు పడుతున్నాయి.

Tags:    

Similar News