చీరకట్టులో నడుము అందాలతో చక్కిలిగింతలు పెడుతున్న స్వయంభు బ్యూటీ!
గ్లామర్ తోనే కాదు చీర కట్టులో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోవచ్చు అని నిరూపిస్తున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో నభా నటేష్ కూడా ఒకరు.;
గ్లామర్ తోనే కాదు చీర కట్టులో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోవచ్చు అని నిరూపిస్తున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో నభా నటేష్ కూడా ఒకరు. నిత్యం తన అందంతో ప్రేక్షకులలో గిలిగింతలు పెట్టే ఈ ముద్దుగుమ్మ.. మరోసారి చీరకట్టులో అందాలతో మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా నడుము అందాలను చూపిస్తూ కుర్రకారు గుండెల్లో గుణపాలు దింపేసింది ఈ వయ్యారి. ఒకవైపు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే. మరొకవైపు తన ప్రతిభతో అందరినీ ఉర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం వరుస పెట్టి అవకాశాలు దూసుకుపోవడమే కాకుండా ఇంస్టాగ్రామ్ లో తన లుక్ తో రోజుకొక ఫోటో షేర్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది.
అందులో భాగంగానే తాజాగా చీరకట్టులో కనిపించింది . సూర్యుడి కిరణాలను ముఖానికి తగలకుండా చేతులు అడ్డుపెట్టుకుంటూ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇందులో ఈమె అందాలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. క్రీమ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో చెక్స్ తో కలగలిసిన ఈ కాటన్ చీర ఈమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది. దీనికి కాంబినేషన్లో వైట్ కలర్ బ్లౌజ్ ధరించిన ఈమె ఆ లుక్కుతో తన మేకోవర్ను పర్ఫెక్ట్ అని నిరూపించుకుంది. మొత్తానికైతే నభా నటేష్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
మరోవైపు నభా నటేష్ వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది.. అందులో భాగంగానే తాజాగా ఈమె నిఖిల్ సరసన స్వయంభు సినిమాలో నటిస్తోంది. ఇందులో చాలా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. ఈమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్ అనే సినిమాలో కూడా నటిస్తోంది . ఇందులో పార్వతీ పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియాగా వస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో నభా పాత్ర శక్తివంతమైన, రహస్యమైన అలాగే సాంప్రదాయ రూపాన్ని కలిగి ఉందని మేకర్స్ ప్రకటించడంతో ఈమె పాత్ర పై అంచనాలు పెరిగిపోయాయి.
ఇకపోతే టైసన్ నాయుడు అనే సినిమాలో కూడా ఈమె అవకాశాన్ని అందుకుంది. ఇలా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోతున్న నభా నటేష్ ఈ సినిమాలతో మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె.. ఆ తర్వాత డార్లింగ్, సోలో బ్రతికే సో బెటర్ , డిస్కో రాజా వంటి చిత్రాలు చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అందుకే సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఈ చిత్రాలు మంచి విజయాన్ని అందించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.