న్యూజిలాండ్ లో నభా అందాలు..

నభా నటేష్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. న్యూజిలాండ్ లో నభా అందాలు అదరహో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.;

Update: 2025-12-19 05:14 GMT

జీవితంలో పైకి ఎదగాలంటే కష్టపడక తప్పదు. అయితే డబ్బు సంపాదించడానికి నిరంతరం కష్టపడుతూ అసలు ఎంజాయ్మెంట్ అంటేనే ఏంటో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది డబ్బు సంపాదనలో పడి తమకంటూ, తమ ఫ్యామిలీకంటూ సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ఇలా నిత్యం పని మీదే ఫోకస్ పెడుతూ అటు ఆరోగ్యాన్ని.. ఇటు ఫ్యామిలీని నిర్లక్ష్యం చేస్తూ.. భవిష్యత్తులో లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. అందుకే అలాంటివి భవిష్యత్తులో జరక్కుండా ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు కాస్త సమయం దొరికితే చాలు వెకేషన్ కి వెళ్లి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తూ.. ఆ ప్రాంతపు రుచులను ఆస్వాదిస్తున్నారు.



 


అలాంటి వారిలో ప్రముఖ యంగ్ బ్యూటీ నభా నటేష్ కూడా ఒకరు. తాజాగా న్యూజిలాండ్ కి ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్ళిన ఈమె.. అక్కడ తన అందాలతో అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా అక్కడ వంటకాలను కూడా టేస్ట్ చేసింది. ముఖ్యంగా బాత్ టబ్ లో జలకాలాడుతున్న ఫోటోలతో పాటు అక్కడి వీధుల్లో తిరుగుతున్న ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది. నభా నటేష్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. న్యూజిలాండ్ లో నభా అందాలు అదరహో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే నభా నటేష్ వెకేషన్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.



 


నభా నటేష్.. నన్ను దోచుకుందువటే అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె, ఆ తర్వాత అదుగో అనే సినిమాలో నటించగా ఈ చిత్రం సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన నభా నటేష్ కి ఆ తర్వాత వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. అలా డిస్కో రాజా , సోలో బ్రతికే సో బెటర్ , డార్లింగ్ వంటి చిత్రాలలో నటించింది.



 


మధ్యలో యాక్సిడెంట్ కావడంతో కొంతకాలం రెస్ట్ తీసుకున్న ఈమె.. ఇప్పుడు నిఖిల్ స్వయంభు మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.



 


దీనికి తోడు ఇటీవల ఈమె ఫస్ట్ లుక్ కి సంబంధించిన పోస్టర్ ను కూడా ఈమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సుందరవల్లి పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పణలో భువన్ శ్రీకర్ నిర్మిస్తుండగా.. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా కార్తికేయ 2 సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న నిఖిల్ చేస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాతో పాటు విరాట్ కర్ణ హీరోగా వస్తున్న నాగబంధం అనే సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది.



 


Tags:    

Similar News