తొలి సినిమాకి పదేళ్లు.. వారితో స్పెషల్ అనుబంధం!
ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.;
ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. విజయ్ సేతుపతి హీరోగా, నయనతార హీరోయిన్ గా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 2015లో విడుదలైన చిత్రం 'నానుమ్ రౌడీ థాన్'.. ఈ సినిమా ఈ ఏడాదికి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఒక స్పెషల్ పోస్ట్ పంచుకున్నారు వవిఘ్నేష్ శివన్. మరి అసలు ఆ పోస్ట్ లో ఏముందో ఇప్పుడు చూద్దాం.
విషయంలోకి వెళ్తే.. ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ 'బోడా బోడి' అనే చిత్రంతో తొలిసారి సినీ రంగ ప్రవేశం చేశారు. ఇందులో శింబు, వరలక్ష్మి శరత్ కుమార్ జంటగా నటించారు. 2012లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో మూడు సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరమైన విఘ్నేష్ శివన్ మళ్ళీ 'నానుమ్ రౌడీ థాన్' సినిమాకి దర్శకత్వం వహించారు. ధనుష్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అటు విఘ్నేష్ శివన్ కి దర్శకుడిగా మంచి పేరును అందించింది.
అలా వీరిద్దరి కాంబినేషన్లో అక్టోబర్ 21 2015న వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ధనుష్ అండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ ద్వారా పంపిణీ చేశారు. విజయ్ సేతుపతి, నయనతార తో పాటు పార్థిబన్, రాధికా శరత్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.
ఈ సినిమా విడుదలై పదేళ్లయిన సందర్భంగా విఘ్నేష్ శివన్ తన ఇంస్టాగ్రామ్ పేజీలో.." నానుమ్ రౌడీ థాన్ సినిమా విడుదలై ఈరోజుకి 10 సంవత్సరాలు. అనేక అద్భుతాలతో ఆశీర్వదించబడిన జీవితం ఈ అందమైన రోజునే ప్రారంభమైంది. కాలం ఎంత అందంగా తన సంగీతాన్ని ప్లే చేసిందంటే.. నేను ఈరోజు గురించి ఎన్నో కలలు కన్నాను" అంటూ తెలిపారు. అలాగే తన భార్య నయనతార, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను ఆయన షేర్ చేసుకున్నారు.
అంతేకాదు ఆయన దర్శకత్వం వహించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా కూడా డిసెంబర్ 18న విడుదల కాబోతుండడంతో ఈ సినిమా గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. "లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా మీ అందరి హృదయాలను చేరే రోజు.. మీ చిరునవ్వు, మీ మాటలు, మీ ప్రేమ.. ఈ రోజును నాకు మరింత ప్రత్యేకంగా మారుస్తున్నాయి. ఎక్కడో లోతుగా నేను ఈ క్షణం కోసం నా ఆనందాన్ని దాచుకున్నాను. ఈరోజు నాకు చాలా అందంగా కనిపిస్తోంది" అంటూ తెలిపారు. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .
విఘ్నేష్ శివన్, నయనతార ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఉయిరే, ఉలగం అనే ఇద్దరు కవల పిల్లలు కూడా జన్మించారు. ఏదేమైనా ఈ సినిమా విడుదల అయ్యి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తన భార్యతో ఉన్న మధుర జ్ఞాపకాలను కూడా ఆయన పంచుకున్నారు.