ముర‌గ‌దాస్ కి కూడా రైట‌ర్లు కావాలా?

కోలీవుడ్ డైరెక్ట‌ర్ ముర‌గ‌దాస్ ని వ‌రుస ప్లాప్ లు వేదిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `స‌ర్కార్` త‌ర్వాత స‌క్సెస్ఓ అంద‌ని ద్రాక్షగా మారింది.;

Update: 2025-09-10 03:00 GMT

కోలీవుడ్ డైరెక్ట‌ర్ ముర‌గ‌దాస్ ని వ‌రుస ప్లాప్ లు వేదిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `స‌ర్కార్` త‌ర్వాత స‌క్సెస్ఓ అంద‌ని ద్రాక్షగా మారింది. `ద‌ర్బార్`, `సికింద‌ర్`, `మ‌ద‌రాసి` ఇలా మూడు హ్యాట్రిక్ ప్లాపులు న‌మోద య్యాయి. ఈసినిమాలు పూర్తి చేయ‌డానికి కూడా చాలా స‌మ‌యం తీసుకున్నారు. ముర‌గ‌దాస్ కెరీర్ లో ఇంత వ‌ర‌కూ ఎన్న‌డు చూడ‌ని ద‌శ ఇది. వీటి వైఫ‌ల్యానికి కార‌ణం ఏంటి? అంటే కంటెంట్ అన్న‌దే ప్ర‌ధానంగా హైలైట్ అయింది. సికింద‌ర్ ప్లాప్ విష‌యంలో తానెంత మాత్రం బాధ్య‌త వ‌హించ‌న‌ని ఈ మ‌ధ్య ప్ర‌క‌టించారు.

రైట‌ర్ల‌తో కొత్త‌గా:

త‌న ప్ర‌మేయం లేకుండానే క‌థ‌ను మార్చేసార‌న్నారు. మ‌రి `ద‌ర్బార్`, `మ‌ద‌రాసి` సంగ‌తేంటి? అంటే ఎవ‌రి ప్ర‌మేయం లేక‌పోయినా ప్లాప్ చిత్రాలుగా తేలాయి. దీంతో ముర‌గ‌దాస్ ఇప్పుడో కొత్త ఆలోచ‌న దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం మొద‌లైంది. కొత్త‌గా రైటింగ్ టీమ్ ని హైయ‌ర్ చేసుకో వాల‌ని ప్లాన్ చేస్తున్నాడని స‌మాచారం. ఆ టీమ్ కేవ‌లం స్టోరీ లైన్లు ఇవ్వ‌డానికి మాత్ర‌మే ప‌ని చేస్తుందిట‌. త‌ర్వాత ఆ లైన్ ని ముర‌గ‌దాస్ పూర్తి స్థాయిలో డెవ‌లెప్ చేసే దిశ‌గా ఓ ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్నారుట‌.

పూరి కూడా గ‌తంలో:

ఆలోచ‌న మంచిదే? అవ‌కాశాల కోసం ఎంతో మంది న‌వ‌త‌రం ర‌చ‌యిత‌లు ఎదురు చూస్తున్నారు. స‌రైన వేదిక‌ దొర‌క‌గా నిరూపించుకోలేక‌పోతున్నారు. ముగ‌ర‌దాస్ లాంటి ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ ఈ ప్లాన్ ని అమ లు చేయ‌గ‌ల్గితే కొత్త‌వారికి అవ‌కాశాలు ద‌క్కుతాయి. గ‌తంలో పూరి జ‌గ‌న్నాధ్ కూడా ప్లాప్ ల్లో ఉన్న స‌మ యంలో ఇత‌ర ర‌చయిత‌ల‌పై ఆధార ప‌డిన సంద‌ర్భాలున్నాయి. తాను కూడా కొత్త ఐడియాల‌తో ఎవ‌రైనా వ‌స్తే ప్రోత్స‌హిస్తాన‌ని ప్రామిస్ కూడా చూసారు. కానీ అది ఆచ‌ర‌ణ‌లోకి రాలేదు.

స్టార్ డైరెక్ట‌ర్ల‌పై వ‌యో భాయ‌రం:

మ‌రిప్పుడు ముర‌గ‌దాస్ ఈ విష‌యాన్ని ఎంత వ‌ర‌కూ సీరియ‌స్ గా తీసుకుంటారో చూడాలి. స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ కూడా కొత్త రైట‌ర్ల వైపు చూస్తున్న‌ట్లు క‌థ‌నాలొస్తున్నాయి. వ‌రుస ప‌రాజ‌యాల నేప‌థ్యంలో? ఆయ‌న థాట్స్ కూడా వ‌ర్కౌట్ అవ్వ‌డం లేదు. దీంతో ఆయ‌నా రైట‌ర్లను కీల‌కంగా భావిస్తున్నారు. ఆస్థాన ర‌చ‌యిత సుజాతా రంగ‌రాజ‌న్ ఉన్నంత కాలం శంక‌ర్ కి ఎలాంటి ఇబ్బంది ఎదుర‌వ్వ‌లేదు. ఆయ‌న కాలం చేయ డంతో? శంక‌ర్ బ్యాడ్ ఫేజ్ కూడా మొదలైంది. మ‌రో లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం కూడా ఈ మ‌ధ్య కాలంలో న‌వ‌ల‌ల‌పై ఆధార‌ప‌డుతోన్న స‌న్నివేశం తెలిసిందే. `పొన్నియ‌న్ సెల్వ‌న్` అలా రూపొందించిన చిత్ర‌మే. మొత్తానికి ఈ న‌యా డైరెక్ట‌ర్ల అంద‌రిపై వ‌యో భారం కాస్త ప్ర‌తి కూలంగా మారుతున్న‌ట్లు క‌ని పిస్తోంది. ముర‌గాస్ 50 క్రాస్ చేయ‌గా, శంక‌ర్ 62 లో ఉన్నారు. మణిర‌త్నం 70కి ద‌గ్గ‌ర్లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News