సీతామహాలక్ష్మి సందడి ముగిసినట్టేనా..?

సీరియల్స్ తో పాపులర్ అయ్యి ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ వెండితెర మీద తన మ్యాజిక్ కొనసాగిస్తుంది.

Update: 2024-05-18 03:56 GMT

సీరియల్స్ తో పాపులర్ అయ్యి ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ వెండితెర మీద తన మ్యాజిక్ కొనసాగిస్తుంది. సీతారామం ముందు మరాఠి, హిందీ సినిమాల్లో మొత్తం 10 సినిమాల దాకా చేసిన మృణాల్ ఠాకూర్ హను రాఘవపుడి డైరెక్షన్ లో సీతారామం సినిమా హీరోయిన్ గా సైన్ చేయడమే ఆమె ఫేట్ మారిపోయేలా చేసింది. సీతామహాలక్ష్మి, నూర్జహాన్ రెండు పాత్రల్లో మృణాల్ యాక్టింగ్ అదరగొట్టేసింది. తెలుగు ఆడియన్స్ కు ఏ హీరోయిన్ అయినా నచ్చితే ఆమెని స్టార్ స్టేటస్ ఇచ్చేస్తారు.


సీతారామం హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఆ వెంటనే న్యాచురల్ స్టార్ నానితో చేసిన హాయ్ నాన్నతో కూడా సక్సెస్ అందుకుంది. రెండు సినిమాలు రెండు సూపర్ హిట్లుగా నిలవడంతో మృణాల్ లక్కీ హ్యాండ్ గా మారింది. అయితే అమ్మడికి థర్డ్ సినిమా రిస్క్ లో పడేసింది. ది విజయ్ దేవరకొండ తో చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా మృణాల్ కి తెలుగులో మొదటి ఫ్లాప్ ఇచ్చింది. ఆ సినిమాలో కూడా మృణాల్ యాక్టింగ్ కు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి కానీ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ లో మాత్రం డీలా పడిపోయింది.

Read more!

ఫ్యామిలీ స్టార్ హిట్ అయితే ఈలోగా మరో ఛాన్స్ వచ్చేదేమో కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అమ్మడికి షాక్ తగినట్టు అయ్యింది. అంతేకాదు వరుస 3 సినిమాలతో దూకుడు చూపించిన మృణాల్ కు మరో ఛాన్స్ ఇవ్వాలన్నా కూడా ఆలోచిస్తున్నారు. మృణాల్ సందడి మూడు సినిమాలకే ముగిసిందని అంటున్నారు. అయితే అమ్మడు సరైన కం బ్యాక్ ఇచ్చేందుకు కథలో వేటలో ఉంది. ఒకరిద్దరు మృణాల్ కావాలని ఆసక్తి చూపుతున్నా నిర్మాతలు మాత్రం ఆమెను వద్దని అంటున్నారట. మరి తెలుగులో ఎంతో వేగంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ అంతే వేగంతో కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంది. కచ్చితంగా మృణాల్ కి మరో లక్కీ చాన్స్ వచ్చి ఆ సినిమా హిట్ అయ్యే దాకా పరిస్థితి ఇలానే ఉంటుందని చెప్పొచ్చు.

సౌత్ లో మృణాల్ పరిస్థితి ఇలా ఉంటే బాలీవుడ్ లో అమ్మడికి లక్ ఫేవర్ చేస్తుంది. అక్కడ ప్రస్తుతం పూజా మేరీ జాన్ సినిమాలో నటిస్తుంది మృణాల్. ఆ సినిమా హిట్ అయితే మళ్లీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News