టాప్ లెస్ లో మృణాల్.. వ్వాటే లుక్

హిందీలో వరుసగా నటించినా తెలుగులో మాత్రం ఆచితూచి సినిమా కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది మృణాల్ ఠాకూర్.;

Update: 2024-01-17 03:15 GMT

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో నూర్జహాన్ పాత్రకు ప్రాణం పోసి అందరి మనసుల్లో సీతగా నిలిచిపోయింది. దీంతో ఈ భామ ఇక తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ భామ అలా చేయలేదు.


హిందీలో వరుసగా నటించినా తెలుగులో మాత్రం ఆచితూచి సినిమా కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది మృణాల్ ఠాకూర్. ఎన్ని అవకాశాలను వస్తున్నా సెలెక్ట్ గా కథలను ఎంచుకుంటోందట. అందుకే సీతారామం వచ్చి చాలా కాలమైనా తెలుగులో రెండు ప్రాజెక్ట్లను మాత్రమే ఓకే చేసింది. వీటిలో ఓ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.

నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీ.. గతేడాది డిసెంబర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో యష్ణగా తన నటనతో ఆకట్టుకుంది మృణాల్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ప్రముఖ దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ లో నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

అయితే మృణాల్ కూడా తెలుగు ఇండస్ట్రీలో గుర్తుండిపోయే పాత్రలను చేయాలని తాను అనుకుంటున్నట్లు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అందుకే పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. దీంతో టాలీవుడ్ అవకాశాల పట్ల ఆమె నిబద్ధతను మెచ్చుకోవాల్సిందేనని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మృణాల్ కు చెందిన ఓ ఫొటో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఆమె టాప్ లెస్ లో ఘాటుగా లుక్ ఇచ్చింది. కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపింది. బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో ఉన్న ఆ పిక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యి లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఫైర్ ఎమోజిస్ పెడుతూ కామెంట్ల బాక్స్ నింపేస్తున్నారు. అయితే ఆ ఫొటో మూడేళ్ల క్రితం మృణాల్ పోస్ట్ చేసిందట.

Tags:    

Similar News