ఫ్రీ PR స్టఫ్ ని ఎంజాయ్ చేస్తున్న మృణాల్..!
లేటెస్ట్ గా మృణాల్ తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో దే టాక్ వు లాగ్ అంటూ.. రూమర్స్ ఆర్ ఫ్రీ.. అండ్ ఐ లవ్ ఫ్రీ స్టఫ్ అంటూ రాసుకొచ్చింది.;
టాలీవుడ్ సీతామహాలక్ష్మి మృణాల్ ఠాకూర్ గురించి ఈమధ్య సోషల్ మీడియాలో తరచు ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న మృణాల్ గురించి ఏదో ఒక విధంగా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. ఐతే ఆమె వీటన్నిటినీ పట్టించుకునేంత టైం లేదు. ఐతే ఫ్రీ టైం లో మృణాల్ వీటిపై ఎలా స్పందిస్తుందా అన్న డౌట్ రాక మానదు. ఐతే ఆ టైం లో కూడా తన మీద వస్తున్న వార్తలపై మృణాల్ సూపర్ ఎంజాయ్ చేస్తుంది.
మృణాల్ పై సోషల్ మీడియాలో..
లేటెస్ట్ గా మృణాల్ తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో దే టాక్ వు లాగ్ అంటూ.. రూమర్స్ ఆర్ ఫ్రీ.. అండ్ ఐ లవ్ ఫ్రీ స్టఫ్ అంటూ రాసుకొచ్చింది. సో మృణాల్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా ఆమె తనకు పాజిటివ్ గానే అనుకుంటుంది. ఏదైనా హీరోయిన్ స్టార్ హీరోతో ఫోటో దిగితే చాలు అదేదో వారిద్దరి మధ్య రిలేషన్ ఉందన్నట్టు వార్తలు రాస్తుంటారు. అలానే రీసెంట్ గా మృణాల్ ఠాకూర్ తో ఒక కోలీవుడ్ హీరో తో దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఆ స్టార్ హీరోతో ఆమెకున్న బాండింగ్ ఏంటంటూ నానా హంగామా చేశారు. ఇక ఇప్పుడు మృణాల్ ఠాకూర్ తో ఒక యువ క్రికెటర్ ని జత కడుతూ వార్తలు రాస్తున్నారు. ఐతే వీటన్నిటిపై పంచ్ వేయాలనే ఉద్దేశ్యంతోనే దే టాక్ వు లాఫ్ అంటూ మృణాల్ తన కామెంట్ పెట్టింది. అంతేకాదు ఫ్రీ గా వస్తున్న స్టఫ్ కాబట్టి ఆమె ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
అడివి శేష్ తో డెకాయిట్..
సో తనపై వస్తున్న రూమర్స్ పై మృణాల్ ఓ విధంగా రెడీగానే ఉందనిపిస్తుంది. హీరోయిన్స్ కి ఇవన్నీ కామనే అనుకుంటూ మృణాల్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే తెలుగులో అడివి శేష్ తో డెకాయిట్ చేస్తుంది మృణాల్ ఆ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. మరోపక్క హిందీలో కూడా మృణాల్ వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది.
తెలుగులో సీతారామం తో ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. నెక్స్ట్ నానితో హాయ్ నాన్న చేసి ఆ సినిమాతో కూడా సూపర్ అనిపించుకుంది. ఐతే థర్డ్ అటెంప్ట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇక ప్రభాస్ కల్కి సినిమాలో ఆమె చేసిన రోల్ పెద్దగా క్రేజ్ తీసుకు రాలేదు. ప్రస్తుతం అడివి శేష్ సినిమా మీదే మృణాల్ తన హోప్స్ పెట్టుకుంది. అటు బాలీవుడ్ లో కూడా తన మార్క్ సినిమాలు చేస్తుంది అమ్మడు.