సముద్రంలో అతి చిన్న చేప పిల్లలా!
అలాంటి వారిలో నేను ఒక్కరిని అంటూ ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ తన కెరీర్ జర్నీ గురించి చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది.;
చిత్ర పరిశ్రమ మహా సముద్రం లాంటింది. వారసులకు అదే సముద్రం ఓ చిన్న చెరువు లాంటింది. వారసత్వం అనేది ఎంట్రీకార్డుగా వినియోగించుకుని సక్సస్ అవుతుంటారు. అలా సక్సస్ అయిన వారెంతో మంది. ఇక బ్యాక్ గ్రౌడ్ లేని వారి పరంగా చూస్తే అలాంటి వారికి పరిశ్రమ నిజంగా మహాసముద్రమే. దిగిన తర్వాతే దాని లోతెంతో తెలుస్తుంది. నెమ్మదిగా ఈత అలవాటు చేసుకుని ఈదటం మొదలు పెట్టినప్పుడే? తీరాన్ని చేరడం అన్నది ఎంత కష్టంగా ఉంటుందన్నది అర్దమవుతుంది. ఇండస్ట్రీలో ఇలా ఎదిగి వారి కెరీర్ కూడా అంతే స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది.
గొప్ప డెబ్యూ చిత్రమది:
ఆ సముద్రంలో ఎన్ని చెరువులు కలిసినా? సునాయాసంగా ఈదగలరు. అలాంటి వారిలో నేను ఒక్కరిని అంటూ ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ తన కెరీర్ జర్నీ గురించి చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. లవ్ సోనియా చిత్రం తన జీవితానికి ఊహించని బహుమతిగా పేర్కొంది. ఈ సినిమా విడుదలై ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా అమ్మడు తానో చిన్న పట్టణం నుంచి వచ్చిన అమ్మాయిగా తెలిపింది. `లవ్ సోనియా`లో అవకాశం కోసం వేలాది మంది వచ్చినా? అందర్నీ కాదని తనని ఎంపిక చేసారంది. ఇది తనకు తొలి సినిమా మాత్రమే కాదని, జీవితాలను మార్చేసే సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టేలా చేసిందన్నారు.
ఆరంభంలో అమ్మడి ఆందోళన:
`లవ్ సోనియా` సెట్ లో కి అడుగు పెట్టగానే భయం కమ్ముకుందని తెలిపింది. చుట్టూ నటనలో ఆరి తేరి నటీనటులు, డెమీ మూర్, రిచా చద్దా, మనోజ్ బాజ్ పాయ్ లాంటి నటుల మధ్యలో పని చేయాలంటే? సినిమా అనే జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారిగా కళ్ల ముందు ప్రత్యక్షమైందంది. వీళ్ల మధ్యనే నటించాలంటే భయపడే తాను అంతకు మించిన నటీనటులతో కలిసి పని చేయాలంటే? తనకు కాళ్లు చేతులు ఆడేవి కాదని పేర్కొంది. ఇండస్ట్రీ అనే అంత పెద్ద సముద్రంలో తానెలా ఈదుతానని నిరతరం భయవేసేదని, కానీ అదే పని అలవాటుగా మారిన తర్వాత తన ఆందోళనంతా తొలగిపోయిందని తెలిపింది.
రెండు భాషల్లోనూ బిజీ:
చిత్ర పరిశ్రమలోచేప పిల్లలా మొదలైన తన ప్రయాణం ఇప్పుడు సంతోషంగా సాగిపోతుందని అభిప్రాయపడింది. అన్ని భాషల నుంచి తనకు అవకాశాలు వస్తున్నాయని..ఇది తనకెంతో సంతోషంగా ఉంటుందని తెలిపింది.
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ `డాకాయిట్` లో నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్-అట్లీ సినిమాలోనూ అమ్మడు ఓ హీరో్యిన్ గా ఎంపికైంది. బాలీవుడ్ లో `తుమ్ హో తోహ్ పూజామేరీజాన్`, ` హైజివానీ తో ఇష్క్ హోనా హై` చిత్రాల్లో నటిస్తోంది. ఇవిగాక కొన్ని కొత్త అవకాశాలు వస్తున్నా? పాత్రలు నచ్చకపోవడంతో అంగీకరించడం లేదు. తొలి నుంచి సెలక్టివ్ గా ఉండటం మృణాల్ కి అలవాటైన పనే.