మృణాల్.. ప్లాన్ మార్చాల్సిందేనా?

టాలీవుడ్‌ లో మృణాల్‌ కు ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. ప్రేక్షకులు కూడా ఆమెను కంటెంట్‌ కు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నారు.

Update: 2026-06-06 06:46 GMT

టీవీ యాక్ట్రెస్ గా కెరీర్ ప్రారంభించి, ప్రస్తుతం బాలీవుడ్‌ తోపాటు టాలీవుడ్‌ లోనూ స్టార్ హీరోయిన్‌ గా గుర్తింపు పొందిన మృణాల్ ఠాకూర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. అందానికి, అభినయానికి ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆమె.. ఇప్పుడు సినిమాల సెలెక్షన్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అయితే మృణాల్‌ 2014లో మరాఠీ చిత్రం విట్టి దండుతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అనంతరం 2018లో విడుదలైన లవ్ సోనియా చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత సూపర్ 30, బాట్లా హౌస్, తూఫాన్, జెర్సీ, ధమాకా, పిప్పా వంటి చిత్రాలతో బాలీవుడ్‌ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

కానీ మృణాల్‌ కు అసలైన స్టార్‌ డమ్‌ ను తీసుకొచ్చింది టాలీవుడ్‌ నే అని చెప్పాలి. 2022లో విడుదలైన సీతారామంలో సీతామహాలక్ష్మి పాత్రలో ఆమె యాక్టింగ్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో తెలుగు ప్రేక్షకులకు మృణాల్ ఎంతో దగ్గరయ్యారు. అనంతరం నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్నలో కూడా తన పాత్రలో మెప్పించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

ఆ రెండు చిత్రాల విజయాలతో మృణాల్‌ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తారనే అభిప్రాయం కూడా బలపడింది. అయితే ఆ తర్వాత వచ్చిన కొన్ని ప్రాజెక్టులు మాత్రం ఆ స్థాయి ప్రభావం చూపలేకపోయాయి. ముఖ్యంగా ఫ్యామిలీ స్టార్ సహా పలు సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. అయినప్పటికీ మృణాల్‌ కు అవకాశాలు మాత్రం తగ్గలేదు.

ఇటీవల వరుణ్ ధావన్, పూజా హెగ్డేతో కలిసి నటించిన హై జవానీ తో ఇష్క్ హోనా హై విడుదలైంది. ఆ చిత్రంలో మృణాల్ స్క్రీన్ ప్రెజెన్స్‌, గ్లామర్‌, నటనకు మంచి మార్కులు వచ్చినప్పటికీ సినిమా కథ విషయంలో మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. ఓల్డేజ్ కామెడీ, వీక్ స్టోరీ కారణంగా సినిమా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో ప్రస్తుతం మృణాల్‌ సినిమా సెలెక్షన్ పై చర్చ మొదలైంది. నటిగా ఆమె టాలెంట్ పై ఎలాంటి డౌట్స్ లేవని, కానీ సరైన కథలు ఎంచుకోవడం మాత్రం చాలా కీలకమని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం హీరోయిన్ల మధ్య పోటీ ఉన్న సమయంలో కేవలం స్టార్ హీరోలు లేదా భారీ నిర్మాణ సంస్థలపై ఆధారపడకుండా, కంటెంట్ ను కూడా పరిశీలించాలని సూచిస్తున్నారు.

టాలీవుడ్‌ లో మృణాల్‌ కు ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. ప్రేక్షకులు కూడా ఆమెను కంటెంట్‌ కు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నారు. సీతారామం, హాయ్ నాన్న వంటి చిత్రాలు అందుకు ఉదాహరణగా నిలిచాయి. అలాంటి కథలను ఎంపిక చేసుకుంటే ఆమె కెరీర్ మరింత స్ట్రాంగ్ మారే అవకాశం ఉందని చెప్పాలి.

ఏదేమైనా మృణాల్ కు ఛాన్సులు తగ్గడం లేదు. అందం, అభినయం, మార్కెట్‌ వాల్యూ అన్నీ ఆమెకు అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఫ్యూచర్ లో సక్సెస్ ట్రాక్ కంటిన్యూ అవ్వాలంటే కథల ఎంపికలో మరింత జాగ్రత్త అవసరమనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు ఆమె తీసుకునే నిర్ణయాలే కెరీర్‌ రేంజ్ ను డిసైడ్ చేసే అవకాశం ఉందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News