డేటింగ్ రూమర్స్.. మృణాల్ కౌంటర్ అదిరింది!

అయితే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ తో మృణాల్ రిలేషన్‌ షిప్‌లో ఉన్నారని కొన్ని వారాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.;

Update: 2025-12-09 14:53 GMT

టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి అందరికీ తెలిసిందే. తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అమ్మడు.. వరుస సినిమాలతో బిజీగా ఉందనే చెప్పాలి. అయితే కొంతకాలంగా ఆమె కెరీర్ పరంగా కాకుండా.. పర్సనల్ లైఫ్ విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

ఎప్పటికప్పుడు ఆమె రిలేషన్ లో ఉన్నారని రూమర్లు వస్తూనే ఉన్నాయి. అందులో నిజం లేకపోయినా తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆమె వాటిని లైట్ తీసుకున్నారు. రీసెంట్ గా తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్ పై రెస్పాండ్ అయ్యారు. అవన్నీ తనకు ఫ్రీ పీఆర్ లు అంటూ.. రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చారు.

తన తల్లితో కలిసి ఉన్న ఒక వీడియోను ఇన్‌ స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్ చేశారు. "వారు మాట్లాడుకుంటారు, మేం నవ్వుకుంటాం. పుకార్లు ఉచిత పీఆర్ లాంటివి. నాకు ఉచిత వస్తువులంటే ఇష్టం! నేను గాసిప్స్ కు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వను" అని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ గా మారాయి.

అయితే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ తో మృణాల్ రిలేషన్‌ షిప్‌లో ఉన్నారని కొన్ని వారాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ సోషల్ మీడియాలో పరస్పరం చేసిన కామెంట్లు, కలిసిన సందర్భాలు ఆ ఊహాగానాలకు కారణమయ్యాయి. ఆ తర్వాత టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తో డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి.

వారిద్దరూ కలిసి కనిపించారని, కొన్ని నెలలుగా రహస్యంగా కలుస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇటీవల టాలీవుడ్ హీరో సుమంత్ తో మృణాల్ ఠాకూర్.. వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే సుమంత్.. ఓ ఇంటర్వ్యూలో ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

ఇక కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి రొమాంటిక్ డ్రామా మూవీ చేస్తున్నారు. అదే సమయంలో టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్‌ తో కలిసి యాక్షన్ థ్రిల్లర్ డెకాయిట్ సినిమాలో నటిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News