• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనిల్ తో సినిమా.. హీరోల...

అనిల్ తో సినిమా.. హీరోల స్పెషల్ ఇంట్రెస్ట్..!

| ఎంచుకున్న కథ.. దానికి తగినట్టుగా కథనం టికెట్ కొని థియేటర్ కి వచ్చిన ఆడియన్ ని ఎంటర్టైన్ చేసి పంపించడమే తన లక్ష్యంగా పెట్టుకుని తను సినిమాలు చేస్తుంటాడు అనిల్.

By - Tupaki Desk
Update: 2023-10-21 15:30 GMT

అంతకుముందు రైటర్ గా పనిచేసిన అనుభవంతో డైరెక్టర్ గా తన మొదటి సినిమా పటాస్ తోనే హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపుడి. అప్పటి నుంచి రీసెంట్ గా వచ్చిన భగవంత్ కేసరి సినిమా వరకు హిట్ సినిమాకు కేరాఫ్ అడ్రెస్ గా మారాడు అనిల్ రావిపుడి. అనిల్ సినిమా అంటే ఇన్నాళ్లు కామెడీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే అనుకున్నారు కానీ భగవంత్ కేసరి తో తన పంథా మార్చేశాడు. బాలకృష్ణ లాంటి మాస్ హీరోతో ఎక్కడ తను రాసుకున్న కథ పరిధి దాటకుండా సినిమా చేసి మెప్పించాడు.

అనిల్ లోని ఈ కన్విక్షన్ టాలెంట్ వల్ల అందరు షాక్ అవుతున్నారు. పటాస్ టు భగవంత్ కేసరి ఓటమి లేని దర్శకుడిగా అనిల్ తన సత్తా చాటాడు. అందుకే స్టార్ హీరోలంతా కూడా అనిల్ వైపు చూస్తున్నారు. అనిల్ తో సినిమా కోసం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మహేష్, వెంకటేష్, బాలకృష్ణ ఇలా స్టార్ హీరోలతో సూపర్ హిట్లు కొడుతున్నాడు అనిల్.

ఎంచుకున్న కథ.. దానికి తగినట్టుగా కథనం టికెట్ కొని థియేటర్ కి వచ్చిన ఆడియన్ ని ఎంటర్టైన్ చేసి పంపించడమే తన లక్ష్యంగా పెట్టుకుని తను సినిమాలు చేస్తుంటాడు అనిల్. అందుకే అతని దర్శకత్వంలో వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా నిరాశపరచలేదు. ముఖ్యంగా బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరి సినిమా చూసిన తర్వాత అనిల్ డైరెక్షన్ మీద మరింత కాన్ఫిడెంట్ పెరిగింది.

సో అనిల్ నెక్స్ట్ సినిమా కచ్చితంగా పెద్ద ప్లానింగ్ తోనే వస్తుందని చెప్పొచ్చు. ఇంతకీ అనిల్ నెక్స్ట్ సినిమా హీరో ఎవరు. డైరెక్టర్ గా వరుస సక్సెస్ లతో ట్రెండ్ సృష్టిస్తున్న అనిల్ తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడు అన్నది తెలియాల్సి ఉంది. అనిల్ నెక్స్ట్ సినిమా అనౌన్స్ మెంట్ కోసం ఆడియన్స్ అంతా కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. యువ హీరోలే కాదు ఇప్పటి నుంచి స్టార్ హీరోలు కూడా అనిల్ తో సినిమా అంటే ఓకే చెప్పే అవకాశం ఉంది. హీరో ఎవరైనా వారి పంథాని మార్చి కొత్త ఇమేజ్ తీసుకొస్తున్న డైరెక్టర్ గా అనిల్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. రాజమౌళి తర్వాత అనిల్ మాత్రమే చేస్తున్న సినిమాలన్నీ హిట్ చేసుకుంటూ వస్తున్నాడు. అతని సినిమాల విషయంలో ఇది అలానే కొనసాగుతూ ఉండాలని కోరుకున్నారు ఆడియన్స్.

Tags:    
  • Tollywood 
  • Bhagavanthkesari 
  • Balakrishna 
  • Sreeleela 
  • Kajalaggarwal 
  • Anilravipudi 
  • Pataas 
  • Mahesh 
  • Venkatesh 
  • Rajamouli 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS