• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇంట్రస్టింగ్‌......

ఇంట్రస్టింగ్‌... అమ్మవార్ల మధ్య పోటీ!

| టాలీవుడ్‌ తో పోల్చితే కోలీవుడ్‌ లో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు ఆదరణ ఎక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

By - Tupaki Desk
Update: 2024-07-15 10:30 GMT

టాలీవుడ్‌ తో పోల్చితే కోలీవుడ్‌ లో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు ఆదరణ ఎక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అక్కడ ప్రతి ఏడాది పదుల సంఖ్యలో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు రూపొందుతున్నాయి. అందులో మంచి విజయాలను సొంతం చేసుకుంటున్న సినిమాలు కూడా ఉన్నాయి.

తమిళ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు అనగానే చాలా మందికి నయనతార, త్రిష, హన్సిక ల పేర్లు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు నయనతార మరియు త్రిషల మధ్య ఒక ఇంట్రస్టింగ్‌ ఫైట్‌ కి తెర లేవబోతుంది. రెండు సినిమాలు నువ్వా నేనా అంటూ ఈ ఇద్దరి స్టార్‌ డమ్‌ కి పరీక్ష పెట్టబోతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాలుగు ఏళ్ల క్రితం నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన మూకుతి అమ్మన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తెలుగు లో అమ్మోరు తల్లి అంటూ వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల డైరెక్ట్‌ ఓటీటీ లో మూకుతి అమ్మన్ స్ట్రీమింగ్‌ అయ్యింది.

ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్‌ చేయాలని నిర్మాణ సంస్థ భావించింది. నయనతార ఇతర కమిట్‌మెంట్స్‌ ఇంకా పలు కారణాల వల్ల మూకుతి అమ్మన్‌ సీక్వెల్‌ కు ఇన్నాళ్ల సమయం పట్టింది. ఎట్టకేలకు సీక్వెల్‌ ను ప్రకటించారు.. కానీ దర్శకుడు మాత్రం మారాడు.

మూకుతి అమ్మన్‌ ను రూపొందించిన దర్శకుడు ఆర్జే బాలాజీ కొత్తగా మాసాని అమ్మన్ అనే సినిమాను త్రిష ప్రధాన పాత్రలో రూపొందించేందుకు ఏర్పాట్లు షురూ చేశాడు. మూకుతి అమ్మన్‌ 2 మరియు మాసాని అమ్మన్‌ సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మూకుతి అమ్మన్ సీక్వెల్‌ ను కాదని మరో అమ్మన్ మూవీని చేసేందుకు సిద్దం అయిన దర్శకుడు బాలాజీ కచ్చితంగా త్రిష తో సూపర్‌ హిట్‌ మూవీ తీస్తాడనే నమ్మకం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు సీనియర్ స్టార్‌ హీరోయిన్స్ అమ్మవార్లుగా నటిస్తే కచ్చితంగా టాప్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అవ్వడం ఖాయం.

Tags:    
  • Nayanthara 
  • Rjbalaji 
  • Mookuthiamman2 
  • Filmindustry 
  • Trisha 
  • Hansika 
  • Mookuthiamman 
  • Godess 

Similar News

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS