• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మోక్షజ్ఞ ఎంట్రీ.. ఈసారి...

మోక్షజ్ఞ ఎంట్రీ.. ఈసారి కూడా నిరాశే..

| అయితే ఈ పుట్టినరోజు మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన ఏదైనా విషయం తెలుస్తుందేమోనని చాలా మంది అభిమానులు ఆశించారు

By - Tupaki Desk
Update: 2023-09-06 07:15 GMT

నందమూరి నటసింహం బాలకృష్ణ ఏకైక పుత్ర రత్నం మోక్షజ్ఞ. టాలీవుడ్ లో ఎంత మంది స్టార్ కిడ్స్ ఉన్నా.. మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి అంతా ఎక్కువగా మాట్లాడుకుంటుంటారు. గత కొన్నేళ్లుగా ఈయన వెండితెర అరంగేట్రం గురించి టాలీవుడ్‌లో జోరుగా ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా గత కొద్ది రోజులుగా అయితే.. ఈ ఊహాగానాలు చాలా ఎక్కువైపోయాయి. మోక్షజ్ఞ స్లిమ్ గా హీరో మెటిరీయల్ గా మారడం, సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ అవ్వడం, రీసెంట్ గా భగవంత్ కేసరి సెట్స్ ను సందర్శించడం.. ఇలా పలు విషయాలే ఇందుకు కారణం. అయితే మోక్షజ్ఞ విషయంలో నేడు(సెప్టెంబర్ 6) నందమూరి అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు.

ఎందుకంటే ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజు. దీంతో నందమూరి అభిమానులు.. సంబరాలు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా మోక్షజ్క్షకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇది మోక్షజ్ఞకు 29వ పుట్టినరోజు. అంటే ఈ వయసు నాటికి బాలయ్య, ఎన్టీఆర్ స్టార్ హీరోలయ్యారు. రికార్డ్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు. కానీ మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం ఆలస్యం అవుతూనే వస్తోంది. దీంతో ఫ్యాన్స్ కాస్త బాధపడుతూనే ఉన్నారు.

అయితే ఈ పుట్టినరోజు మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన ఏదైనా విషయం తెలుస్తుందేమోనని చాలా మంది అభిమానులు ఆశించారు. కానీ అలా జరగలేదు. అందుకే వాళ్లంతా మోక్షజ్ఞకు బర్త్ డే విషెస్ చెబుతూనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడో చెప్పాలంటూ తెగ అడిగేస్తున్నారు.

ఇకపోతే మోక్షజ్ఞ తొలి సినిమాను.. టాలీవుడ్‌కు చెందిన బడా డైరెక్టర్ చేతిలో పెట్టబోతున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. వారిలో అనిల్ రావిపూడి, కొరటాల శివ, బోయపాటి, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల సహా పలువురు పేర్లు బాగా వినిపించాయి. మోక్షజ్ఞ నటనతో పాటు ఫైట్స్, డాన్స్ విషయంలో ట్రైనింగ్ తీసుకుంటున్నారని కూడా ప్రచారం సాగింది. మోక్షజ్ఞ కోసం కథలు కూడా రెడీగా ఉన్నాయని, సాయి కొర్రపాటి, అనిల్ సుంకర, అశ్వినీదత్ వంటి నిర్మాతలు క్యూలో ఉన్నారని కూడా చెబుతున్నారు. కానీ ఇంకా దేనిపై క్లారిటీ రాలేదు.

ఏదేమైనప్పటికీ నేడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఏమైనా అప్డేట్ దొరుకుతుందని ఆశగా ఎదురుచూసినా వారికి ఈ బర్త్ డే కూడా నిరాశే మిగిలింది. కనీసం వచ్చే ఏడాది పుట్టినరోజు కైనా మోక్షజ్ఞ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ రావాలని ఆశిస్తున్నారు. లేదంటే ఇంకా వీలైనంత త్వరగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా సత్తా చూపెట్టాలని గట్టిగా కోరుకుంటున్నారు. చూడాలి మరి ఎప్పుడు, ఎవరితో మోక్షజ్ఞ లాంఛింగ్ ఉంటుందో..

Tags:    
  • Nandamuribalakrishna 
  • Mokshagnateja 
  • Boyapatisrinu 
  • Srikanthodela 
  • Mokshagnadebut 
  • Filmindustry 
  • Balakrishnason 

Similar News

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

Copyright @2026

Powered by Blink CMS