సందీప్ రెడ్డి కి బాలీవుడ్ సంచలనం వీరాభిమాని!
తెలుగు సంచలనం సందీప్ రెడ్డి వంగా చిత్రాల సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు.;
తెలుగు సంచలనం సందీప్ రెడ్డి వంగా చిత్రాల సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. `అర్జున్ రెడ్డి`, `కబీర్ సింగ్`, `యానిమల్` విజయాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అతడు బ్రాండ్ అయ్యాడు. అతడి మేకింగ్ విధానానికి టాప్ స్టార్లే ఫిదా అయ్యారు. ఫిల్మ్ మేకింగ్ లో ఓ కొత్త ట్రెండ్ ని పరిచయం చేసాడు వంగా. దీంతో రాజమౌళి, రాంగోపాల్ వర్మ లాంటి లెజెండరీలే అతడికి అభిమానులుగా మారి పోయారు. తాజాగా వాళ్ల సరసన బాలీవుడ్ సంచలన డైరెక్టర్ మోహిత్ సూరి కూడా చేరిపోయారు. డైరెక్టర్ గా మోహిత్ చాలా సీనియర్.
దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్ లో రాణిస్తున్నారు. తనదైన మార్క్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ చిత్రాలతో అతడికంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. `ఆషీకీ-2` తరహాలోనే తాజాగా రిలీజ్ అయిన `సైయారా` కూడా అలాంటి విజయాన్నే నమోదు చేసింది. మ్యూజికల్ గానూ సినిమాలను హిట్ చేయడం మోహిత్ ప్రత్యేకత. అంతటి లెజెండరీ డైరెక్టర్ కూడా సందీప్ రెడ్డికి వీరాభిమానిగా ప్రకటించుకున్నాడు. సందీప్ బోల్డ్ స్టోరీ టెల్లింగ్ లో అద్భుతమైన ఎమోషన్ పండిచంగలడు. అతడి లో డేరింగ్ యాటిట్యూడ్ అంతే ఇష్టం.
సందీప్ కథల్లో ధైర్యంగా కనిపిస్తుంది. ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ కి కట్టుబడి చేయడం అన్నది చిన్న విష యం కాదు. అది సందీప్ లాంటి యాటిట్యూడ్ ఉన్న వారికే సాధ్యమవుతుందన్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు మీడియాలో వైరల్ గా మారాయి. మూడు విజయాలతోనే సందీప్ రెడ్డి టాప్ డైరెక్టర్లనే తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఇంకా ఆయన ఆసలైన స్టార్లతో సినిమాలు చేయడం ప్రారంభించలేదు. ప్రభాస్ తో త్వరలో `స్పిరిట్` చేస్తున్నాడు.
అంత పెద్ద స్టార్ తో` స్పిరిట్` చేసి హిట్ కొట్టిన తర్వాత సందీప్ రేంజ్ ఇంకే స్థాయిలో ఉంటుందో చెప్పా ల్సిన పనిలేదు. ఇంకా అతడి లైనప్ లో మహేష్, రామ్ చరణ్, బన్నీ ఇలా ఎంతో మంది స్టార్లు ఉన్నారు. వాళ్లతో కూడా సినిమాలు చేసిన తర్వాత సందీప్ స్థాయి పీక్స్ కు చేరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.