వాళ్లు నన్ను నమ్మక పోవడం బాధించింది

ఈ సమయంలోనే ఆ సినిమా దర్శకుడు మోహిత్‌ సూరి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశాడు.;

Update: 2025-09-08 23:30 GMT

బాలీవుడ్‌ సినిమాలు తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటున్న ఈ సమయంలో వచ్చిన సయ్యార సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక చిన్న సినిమాగా వచ్చిన సయ్యార సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 600 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేసింది. ఈ స్థాయి వసూళ్లను మేకర్స్ మాత్రమే కాకుండా ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. సయ్యార విడుదల అయ్యి దాదాపుగా రెండు నెలలు కావస్తున్నా ఇంకా చాలా థియేటర్‌లలో ఆడుతూనే ఉందని సమాచారం. ఉత్తర భారతంలో సయ్యార సినిమా బాక్సాఫీస్‌ వద్ద చేసిన సందడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సినిమా గురించి జనాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ సమయంలోనే ఆ సినిమా దర్శకుడు మోహిత్‌ సూరి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశాడు.

సయ్యార సినిమాతో సూపర్‌ హిట్‌

మోహిత్‌ సూరి ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలను తెరకెక్కించిన విషయం తెల్సిందే. 2011లో మర్డర్‌ 2, 2007లో అవరపన్‌, 2014లో ఏక్‌ విలన్‌, 2020లో మలంగ్‌ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ముఖ్యంగా ఈయన దర్శకత్వంలో వచ్చిన ఆషికి 2 సినిమా 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. లవ్ స్టోరీ సినిమాలకు ఈయన గొప్ప స్టోరీ టెల్లర్ అనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో ఈయనకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన ఆషికి 3 సినిమాను చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల తప్పుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా నుంచి తప్పుకున్న సమయంలోనే వెంటనే సయ్యార సినిమాను మొదలు పెట్టాడు.

మోహిత్‌ సూరి దర్శకత్వంలో..

సయ్యార సినిమా కు ముందు చాలా అవమానాలు ఎదుర్కొన్నట్లుగా తాజా ఇంటర్వ్యూలో మోహిత్‌ సూరి ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకానొక సమయంలో చాలా మంది స్టార్స్ పిలిచి మరీ అవకాశం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ వరుసగా ఫ్లాప్స్ పడ్డ సమయంలో మాత్రం తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. సయ్యార సినిమా కంటే ముందు ఏ హీరోను కలిసినా, హీరోయిన్‌ను కలిసినా తిరస్కరణ ఎదురైంది. వాళ్లు నేను చెప్పిన కథను నమ్మలేదు, వారు ఏం చేయాలో నాకు చెప్పే వారు, ఏ ఒక్కరూ నన్ను నమ్మి నాతో సినిమాను చేసేందుకు ముందుకు రాకపోవడం చాలా బాధను కలిగించింది అని దర్శకుడు మోహిత్‌ సూరి అన్నాడు. సయ్యార సినిమాతో మళ్లీ తన సత్తా చాటుకున్న మోహిత్‌ సూరి బాలీవుడ్‌లో మరోసారి తన జోరును కనబర్చే అవకాశాలు ఉన్నాయి.

యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో మోహిత్‌ సూరి దర్శకత్వంలో

యష్ రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమా కొరియన్‌ మూవీ ఎ మూమెంట్‌కి అఫిషియల్‌ రీమేక్. 2004లో వచ్చిన ఆ కొరియన్‌ మూవీని ఇప్పుడు రీమేక్ చేసినా ప్రేక్షకుల ఆధరణ సొంతం చేసుకుంది. అహాన్ పాండే, అనీత్‌ పద్దా లు ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమానే అయినా ఇద్దరూ మంచి నటనతో మెప్పించారు. అంతే కాకుండా హీరో, హీరోయిన్‌ అని కాకుండా ఆ పాత్రల్లో ఒదిగి పోయిన తీరు అందరినీ మెప్పించింది. యశ్‌ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌ వరుస ఫ్లాప్స్‌ తో సతమతం అవుతున్న సమయంలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మరిన్ని హిట్‌ సినిమాలను తీసే ఉత్సాహం నిర్మాతలకు దక్కిందని చెప్పాలి. దాదాపుగా రూ.600 కోట్లు వసూళ్లు చేసిన సయ్యార సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌తోనూ సూపర్‌ హిట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News