7 సార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. ఎందుకంటే
సౌత్ ఇండియాలోని స్టార్ హీరోల సరసన నటించిన మోహిని నుంచి ఆఖరిగా సినిమా వచ్చింది 2011లో.;
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసి సౌత్ ఇండియన్ సినిమాలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మోహిని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన పోరాటం, తన లైఫ్ లో జరిగిన వింత అనుభవాలను పంచుకున్నారు. తాను ఏకంగా ఏడుసార్లు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి
సౌత్ ఇండియాలోని స్టార్ హీరోల సరసన నటించిన మోహిని నుంచి ఆఖరిగా సినిమా వచ్చింది 2011లో. ఆమె నటించిన ఎన్నో పాత్రల్ని ఆడియన్స్ ఇప్పటికీ ఇష్టపడతారు. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే 1991లో 23 ఏళ్ల వయసులో మోహిని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోయారు. పెళ్లి తర్వాత కూడా మోహిని కొన్ని సినిమాల్లో నటించారు.
ఏడు సార్లు సూసైడ్ కు ప్రయత్నించా
పెళ్లి తర్వా భర్త, పిల్లలతో తాను చాలా హ్యాపీగా ఉన్నానని, కానీ కొంతకాలానికి సడెన్ గా తాను డిప్రెషన్ లోకి వెళ్లానని చెప్పుకొచ్చారు. అయితే తాను డిప్రెషన్ లోకి వెళ్లడానికి కారణమేమీ లేదని, ఇంతకుముందులానే తన లైఫ్ చాలా సంతోషంగా ఉందని, కానీ తాను మాత్రం డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, ఒకనొక టైమ్ లో జీవితాన్ని అంతం చేసుకోవడానికి కూడా ప్రయత్నించానని, అది ఒకసారి కూడా కాదు ఏడుసార్లు అని చెప్పుకొచ్చారు మోహిని.
క్షుద్రపూజలు చేశారని చెప్తే నవ్వుకున్నా
అయితే తాను డిప్రెషన్ లోకి వెళ్లినప్పుడు ఓ జ్యోతిష్కుడిని కలిశానని, ఆయన తనపై ఎవరో క్షుద్రపూజలు చేశారని చెప్పారని, అది విని మొదట్లో తాను నవ్వుకున్నానని, కానీ తర్వాత అదే నిజమని నమ్మానని లేకపోతే అంతా బావున్నప్పుడు తాను ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తానని అనుకున్నానని చెప్పారు. కానీ ఆఖరికి దేవుణ్ని నమ్ముకుని తాను దాన్నుంచి బయటపడినట్టు ఆమె వెల్లడించారు.