మోహన్ లాల్ హృదయపూర్వం ఎలా ఉంది..?
మలయాళ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్ లో సత్యన్ అంతికాడ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా హృదయపూర్వం.;
మలయాళ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్ లో సత్యన్ అంతికాడ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా హృదయపూర్వం. లాస్ట్ మంత్ రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించింది. పోటీగా వచ్చిన లోక సినిమాతో ఫైట్ చేసి బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా డిజిటల్ రిలీజ్ అయ్యింది. జియో హాట్ స్టార్ ఓటీటీలో రిలీజైన ఈ సినిమా కథ ఏంటి.. మలయాళ ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా తెలుగు ఓటీటీ ఆడియన్స్ ని ఏమేరకు మెప్పిస్తుంది.. అసలు సినిమా కథ ఏంటో ఓ లుక్కేద్దాం.
సందీప్ కి ఎదురైన పరిస్థితులు..
హార్ట్ అన్ హెల్తీ తో బాధపడుతున్న సందీప్ బాలకృష్ణన్ (మోహన్ లాల్)కు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన ఆర్మీ కర్నల్ గుండెను పెట్టి సర్జరీ చేస్తారు. ఐతే అతని హెల్త్ క్యూర్ అయ్యే వరకు అతనికి తోడుగా జెర్రీ (సంగీత్ ప్రతాప్)ని గార్డ్ గా ఉంచుతారు. సందీప్ అప్పటికే తను నడిపే క్లౌడ్ కిచెన్ విషయాలు చూస్తుంటాడు.. ఐతే ఆ టైం లో కర్నల్ రవిచంద్రన్ కూతురు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యిందని సందీప్ ని రావాలని అంటుంది. ముందు రాలేనని చెప్పిన సందీప్ జెర్రీతో కలిసి పూణెకి వెళ్తాడు. ఐతే అనుకోని కారణాల వల్ల హరిత ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది. కర్నల్ భార్య, కూతురు సందీప్ మీద ప్రేమ చూపిస్తారు. ఆ టైం లో సందీప్ కి ఎదురైన పరిస్థితులు ఏంటి..? ఇవి ఎలా టర్న్ తీసుకున్నాయి అన్నది హృదయపూర్వం సినిమా కథ.
ఆర్గాన్ డొనేషన్.. ఆ తర్వాత వాళ్లకు సంబంధించిన మనుషులు వీరి చుట్టూ తిరగడం లాంటి సినిమాలు ఇదివరకు వచ్చాయి. ఐతే హృదయం పూర్వం చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ముఖ్యంగా సందీప్ రోల్ లో మోహన్ లాల్ మరోసారి తన వర్సటాలిటీ చూపించారు. సంగీత్ ప్రతాప్, మాళవిక మోహనన్ కూడా తమ పాత్రల్లో మెప్పించారు.
మోహన్ లాల్ పాత్రలో ఒదిగిపోయిన తీరు..
డైరెక్టర్ ఈ సినిమాను ఒక ఎమోషన్ తో మొదలు పెట్టి ఒక ఆహ్లాదకరమైన సినిమాగా నడిపించాలని అనుకున్నాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. సందీప్ కోసం బావ పణికర్ వచ్చినప్పటి నుంచి కామెడీ ఇంకాత ఎక్కువ అవుతుంది. హరిత ఫాదర్ ఎమోషన్ పండలేదు సరికదా బోర్ అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా ఒక మంచి ఫీల్ అందిస్తుంది.
మోహన్ లాల్ తన పాత్రలో ఒదిగిపోయిన తీరు అద్భుతం. ఆయన ఇలాంటి రోల్స్ లో అద్భుతంగా చేస్తారు. ఛాలెంజింగ్ రోల్స్ ని అంతే ఛాలెంజింగ్ గా చేస్తుంటారు. ఐతే ఎలాంటి కమర్షియల్ హంగులు లేకపోవడం అక్కడక్కడే కథ నడుస్తుండటం అనేది కొంతమంది ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు. ఐతే మెజారిటీ ఆడియన్స్ మాత్రం సినిమా ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది.