మోహన్ లాల్ నాన్ స్టాప్ ఎక్స్ ప్రెస్..!

మలయాళ స్టార్ మోహన్ లాల్ ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేయనిదే నిద్రపోయేలా లేరు.;

Update: 2025-12-03 06:40 GMT

మలయాళ స్టార్ మోహన్ లాల్ ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేయనిదే నిద్రపోయేలా లేరు. ఆల్రెడీ ఈ ఇయర్ ఎల్ 2 ఎంపురాన్, థుడరం, హృదయపూర్వం అంటూ 3 సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. 3 సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి. ఇక నెక్స్ట్ ఇయర్ కి సీన్మాలు రెడీ చేస్తున్నారు మోహన్ లాల్. జీతూ జోసెఫ్ తో మోహన్ లాల్ చేస్తున్న దృశ్యం 3 నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ లాక్ చేశారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా దృశ్యం సీరీస్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకు తగినట్టుగానే జీతూ జోసెఫ్ సినిమాలు చేస్తున్నారు.

జైలర్ 2 లో మోహన్ లాల్..

ఇక ఈ సినిమాతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ చేస్తున్న జైలర్ 2 లో కూడా మోహన్ లాల్ భాగం అవుతున్నారట. మలయాళంలో సొంత సినిమా చేస్తూ తమిళ్ లో రజనీ సినిమాకు సపోర్ట్ గా ఉంటున్నారు మోహన్ లాల్. యువ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా మోహన్ లాల్ వర్కింగ్ స్టైల్ ఉంది. ఒక సినిమా పూర్తి కాగానే మరో సినిమా ఇలా వరుస షెడ్యూల్ తో బిజీగా ఉంటున్నారు.

ఐతే మోహన్ లాల్ వరుస సినిమాలు చేస్తున్నా ఆ సినిమాల్లో కంటెంట్ మాత్రం కచ్చితంగా ఉండేలా చూస్తారు. ఈ ఇయర్ వచ్చిన ఎల్ 2 ఎంపురాన్ ఒక కమర్షియల్ సినిమా కాగా.. థుడరం, హృదయపూర్వం మంచి కాన్సెప్ట్ తో వచ్చాయి. ఇటు ఫ్యాన్స్ కోసం కమర్షియల్ సినిమాలు చేస్తూనే కంటెంట్ ఉన్న సినిమాలతో తన సత్తా చాటుతున్నారు మోహన్ లాల్.

సొంత భాషలో సినిమాలు చేస్తూనే..

తెలుగు ఆడియన్స్ కి మోహన్ లాల్ చాలా దగ్గరయ్యారు. జనతా గ్యారేజ్ లో నటించిన మోహన్ లాల్ మనమంతా సినిమా చేశారు. ఈమధ్యనే కన్నప్పలో క్యామియో రోల్ చేశారు మోహన్ లాల్. సో సొంత భాషలో సినిమాలు చేస్తూనే సౌత్ అన్ని భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నారు మోహన్ లాల్. ఇక మోహన్ లాల్ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమాలు కూడా సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ఉంటాయని చెప్పొచ్చు.

మోహన్ లాల్ సినిమా అంటే చాలు కచ్చితంగా ఏదో ఒక కొత్త కథతో వస్తారన్న నమ్మకం ఆడియన్స్ లో ఉంది. అందుకే ఆయన సినిమాలు వరుస విజయాలను అందుకుంటున్నాయి. రాబోతున్న దృశ్యం 3 మీద ఆడియన్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

మోహల్ లాల్ తెలుగు ఫ్యాన్స్ ఆయన ఇక్కడ మరిన్ని సినిమాలు చేయాలని కోరుతున్నారు. ఐతే రజనీతో జైలర్ 2 సినిమాలో మోహన్ లాల్ రోల్ సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది.

Tags:    

Similar News