జనాలు థియేటర్లకు ఎందుకు రావట్లేదు.. కారణమిదేనా?

త్రిబాణధారి బార్బరిక్‌ డైరెక్టర్ మోహన్ శ్రీవత్స ఇటీవల తన మూవీ పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.;

Update: 2025-09-01 10:11 GMT

త్రిబాణధారి బార్బరిక్‌ డైరెక్టర్ మోహన్ శ్రీవత్స ఇటీవల తన మూవీ పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన మాట్లాడిన వీడియో తెగ వైరలైంది. సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చినా.. నచ్చిందని కొందరు చెబుతున్నా.. థియేటర్స్ కు ఆడియన్స్ ఎందుకు రావడం లేదని ఆయన వాపోయారు. రెండున్నరేళ్ల పాటు రోజూ కష్ట పడినట్లు చెప్పిన శ్రీవత్స.. సినిమా నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటానంటూ చేసిన సవాల్ ను ఆయన గుర్తు చేసుకున్నారు. కానీ థియేటర్స్ కు ఇప్పుడు ప్రేక్షకులే రావడం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

అయితే ఒక టాలెంట్ ఉన్న డైరెక్టర్ కన్నీరు పెట్టుకోవడం చాలా మందిని కలిచివేసిందని చెప్పాలి. ముఖ్యంగా సినిమాలో కంటెంట్ లేకపోతే తర్వాత విషయం.. కానీ మంచి కంటెంట్ ఉన్నా కూడా అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. దీంతో ఏడవడంతో అంతా ఆయన కోసమే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. శ్రీవత్స మాట్లాడిన మాటల్లో కూడా న్యాయం ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

కంటెంట్ ఉన్న చిన్న సినిమాకు ఆడియన్స్ నుంచి స్పందన లభించకపోతే ఎవరికైనా తీవ్ర నిరాశను కలిగిస్తుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అంత కష్టపడి రెండున్నరేళ్ల పాటు తీసిన సినిమాకు రెస్పాన్స్ రాకపోతే బాధగానే ఉంటుంది. అయితే అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? కారణాలేంటి? అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనేది హాట్ టాపిక్ గా మారింది. నిజానికి.. సినిమాలను చూసే విషయంలో ఆడియన్స్ దృష్టి అంతా మారిపోయింది. ఒకప్పుడు వేరు.. నిన్న కాక మొన్న వేరు.. ఇప్పుడు ఇంకా వేరు. ఎందుకంటే సినిమాలను థియేటర్స్ లో ఆడియన్స్ చూడడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రమోషన్స్ లో హైప్ క్రియేట్ చేసి.. బడ్జెట్ కోసం చెప్పి.. అది చెప్పి.. ఇది చెబితే కాస్త చూస్తున్నారు.

అంత చెప్పారుగా.. ఎలా ఉందో ఓ సారి చూద్దాం అనే కోణంలో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నారు., అలా కాకుండా స్టార్ క్యాస్టింగ్, బడా హీరోలు మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్, చిరంజీవి వంటి స్టార్స్ మూవీలు వస్తే కచ్చితంగా థియేటర్స్ కు వెళ్తున్నారు. ముందే ప్లాన్లు కూడా వేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు చిన్న సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. చిన్న సినిమాలు బాగుంటే బ్రహ్మరథం పట్టేవారు. థియేటర్స్ కు తరలి వెళ్లేవారు. బ్లాక్ బస్టర్ హిట్స్ చేసేవారు. కానీ ఇప్పుడు బాగున్నా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏదో అమావాస్యకో.. పౌర్ణమికో అన్నట్టు ఆదరిస్తున్నారు. రీసెంట్ గా కొన్ని చిత్రాల విషయంలో అదే జరిగింది. ఇటీవల రిలీజ్ అయిన బార్బరిక్ తోపాటు పలు సినిమాలు కూడా పరవాలేదనిపించేలా ఉన్నాయి. కంటెంట్ పర్వాలేదు అని టాక్ ఉంది కానీ థియేటర్స్ కు మాత్రం ఆడియన్స్ రావడం లేదు. ఆక్యుపెన్సీ చాలా తక్కువగా కనిపిస్తోంది.

వీటన్నింటికీ ఓ బలమైన కారణం కూడా ఉంది.. అదే ఓటీటీలు.. వాటి వల్ల కూడా అలా జరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే మంచి కంటెంట్ ఉన్నా.. హిట్ అయినా.. చివరకు ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా.. అప్పుడు చూడొచ్చనే ధీమాతో అనేక మంది సినీ ప్రియులు ఉన్నట్లు కనిపిస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలకు వెళ్దాం.. చిన్న మూవీలను ఓటీటీల్లో చూసుకుందాం అనుకుంటున్నారు. నాలుగు వారాలు ఆగితే చాలు కదా అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే ముందు పెను మార్పులు తేవాల్సింది ఓటీటీ వ్యవస్థలోనే. నిబంధనలను కచ్చితంగా మార్చాలి. నాలుగు వారాలు కాదు.. థియేటర్స్ లో రిలీజ్ అయినా ఆరు నెలల తర్వాత ఓటీటీల్లోకి అందుబాటులోకి వచ్చేలా చూడాలి. అప్పుడే సినిమాలను థియేటర్స్ లో కచ్చితంగా చూస్తారు ఆడియన్స్. హిట్ టాక్ వస్తే థియేటర్స్ కు తరలివెళ్తారు.

ఓటీటీల నిబంధనలు మారితేనే సినీ ప్రియులు మారుతారు. తమ మైండ్ సెంట్ ను ఛేంజ్ చేసుకుంటారు. లేకుంటే ఇండస్ట్రీ, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కు కష్టమనే చెప్పాలి. ఓటీటీ వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తే థియేటర్స్ కు మనుగడ ఉంటుంది. అప్పుడే ఆడియన్స్ కు కచ్చితంగా సినిమాలు చూడాలనిపిస్తుంది. అదే సమయంలో ఇప్పుడు మోహన్ శ్రీవత్స లాంటి డైరెక్టర్స్ కు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. ఏదేమైనా ఆయన బార్బరిక్ తో మంచి కంటెంట్ తీసుకొచ్చారు. తనదైన శైలిలో తెరకెక్కించారు. ప్రమోషన్స్ ను వినూత్నంగా నిర్వహించారు. నిర్మాత కూడా డైరెక్టర్ కు బాగా సహకారం అందించారు. కానీ రిజల్ట్ మాత్రం అలా. ఏదేమైనా ఓటీటీ వ్యవస్థలో మార్పులు ఉంటే వేరేలా ఉండేదేమో..

Tags:    

Similar News