మిత్రమండలి లో కామెడీనే కాదు, ఆ యాంగిల్ కూడా!
టాలీవుడ్ లో ఒక పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులవుతుంది. దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ జానర్ లో సినిమా ఎప్పుడొస్తుందా అని ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.;
టాలీవుడ్ లో ఒక పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులవుతుంది. దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ జానర్ లో సినిమా ఎప్పుడొస్తుందా అని ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మిత్ర మండలి అనే సినిమా రాబోతుంది. మిత్ర మండలి ట్రైలర్ చేస్తుంటే ప్రేక్షకుల కామెడీ ఆకలిని తీర్చేలానే కనిపిస్తుంది. ఈ దీపావళికి మిత్ర మండలి రిలీజ్ కాబోతుంది.
మిత్ర మండలి పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్
అక్టోబర్ 16న మిత్రమండలి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియదర్శి, నిహారిక, మ్యాడ్ ఫేమ్ విష్ణు ఓయి, సత్య, వెన్నెల కిషోర్, రాగ్ మయూర్ ప్రధాన పాత్రల్లో నటించిన మిత్ర మండలి సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. బన్నీ వాస్ సమర్పణలో తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ ఆడియన్స్ నుంచి అశేష స్పందన తెచ్చుకున్నాయి.
సెన్సార్ పూర్తి చేసుకున్న మిత్ర మండలి
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడంతో పాటూ తాజాగా సినిమాను సెన్సార్ కు పంపగా, సెన్సార్ బోర్డు నుంచి మిత్ర మండలి యు/ఎ సర్టిఫికేట్ ను అందుకుంది. అంతేకాదు, మిత్ర మండలిని చూసిన సెన్సార్ మెంబర్స్ ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉందని, సమాజంలోని వ్యవస్థల మీద సెన్సిటివ్ గానే విమర్శించారని చిత్ర యూనిట్ ను ప్రశంసిచినట్టు తెలుస్తోంది.
దీపావళి విజేత ఎవరో?
మిత్ర మండలి మూవీని కామెడీ యాంగిల్ లో చూపిస్తూనే మంచి సెటైరికల్ సినిమాగా తెరకెక్కించారని సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ను మెచ్చుకున్నారని, ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ చూసే విధంగా ఉందని చెప్పారని టాక్. బీవీ వర్క్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా మేకర్స్ డిఫరెంట్ గా చేస్తున్నారు. ఈ దీపావళికి మిత్ర మండలితో పాటూ కె ర్యాంప్, తెలుసు కదా, వృషభ సినిమాలు కూడా రానుండగా, వాటిలో ఏ సినిమా దీపావళి విజేతగా నిలుస్తుందో చూడాలి.