సూపర్‌స్టార్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇదేనా?
62 ఏళ్ల వయసులో టామ్ క్రూజ్ గగుర్పొడిచే విన్యాసాలతో రక్తి కట్టించాడు. ఎంఐ 8 సినిమాలో అతడి సాహసాలు అన్నీ ఇన్నీ కావు.;
62 ఏళ్ల వయసులో టామ్ క్రూజ్ గగుర్పొడిచే విన్యాసాలతో రక్తి కట్టించాడు. ఎంఐ 8 సినిమాలో అతడి సాహసాలు అన్నీ ఇన్నీ కావు. గాల్లో ఎగిరే విమానాల్లోంచి పారా చూట్ జంప్ లు చేసిన రియల్ వీరుడిగా చరిత్రకెక్కాడు. అతడు ఎంఐ సిరీస్ సినిమాలలోనే అత్యధికంగా 16 సార్లు తగలబడతున్న పారాచూట్ నుంచి జంప్ చేసాడు. ఇది ఒక రికార్డ్. ఈ సినిమా టాక్ కి తగ్గట్టే ఆరంభ వసూళ్లు అద్భుతంగా వచ్చాయి. కానీ ఒక బిలియన్ డాలర్ వసూళ్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న టామ్ కి తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ సినిమా ఇప్పటివరకూ 500మిలియన్ డాలర్లను మాత్రమే వసూలు చేసింది. కానీ ఇది సుమారు 800 మిలియన్ డాలర్లు వసూలు చేస్తేనే బ్రేక్ ఈవెన్ అయినట్టు. అంటే ఇంకా దాదాపు 300 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించాల్సి ఉంది. కానీ ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిందని ట్రేడ్ చెబుతోంది. దీనిని బట్టి ఫ్రాంఛైజీలో ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా నిలవనుంది.
`మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్` ఎంఐ ఫ్రాంచైజీలో చివరి భాగం. ఈ చిత్రంపై పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయి. ఇది గత నెలలో విడుదలై మిశ్రమ స్పందనలు పొందింది. ప్రారంభ వారాంతంలో బాక్సాఫీస్ వసూళ్లు కూడా నిరాశపరిచాయి. అయితే ఫ్రాంఛైజీలో మునుపటి భాగం అద్బుత వసూళ్లను సాధించింది. దాంతో పోలిస్తే ఈ చివరి చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. సినిమాకి పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చినా కానీ, అతి భారీగా ప్రమోషన్స్ కోసం ఖర్చు చేయడంతో అది తిరిగి రాలేదు. నిర్మాత నటుడు అయిన టామ్ క్రూజ్ ఎంతో ఆశిస్తే ఈ సినిమా నిజంగా ఆశ్చర్యపరిచింది. అయితే దీనికి కారణం మునుపటి సినిమాల్లో తరహాలో భారీ ఛేజ్ లు, అనూహ్యమైన ట్విస్టులు లేకుండా ఫ్లాట్ గా, డ్రమటిగ్గా కథనం సాగడమే ఇంతగా నిరాశపరచడానికి కారణం. ఎంఐ సిరీస్ లో 8వ సినిమా డెడ్ రికనింగ్ లో భారీ ఛేజ్ లు, జంప్ లు, యాక్షన్ విన్యాసాలు ప్రతి పావు గంటకు ఒక ట్విస్టు ఉంటుంది. కానీ ఫైనల్ రికనింగ్ లో అలాంటి మెరుపులు లేకపోవడంతో ప్రపంచ దేశాల్లో మాస్ కి అంతగా కనెక్టవ్వలేదని విశ్లేషిస్తున్నారు. టూమచ్ మెలోడీ, డ్రామా మాస్ ఆడియెన్ కి కనెక్టవ్వకపోవడం ఈ నష్టాలకు కారణమని భావిస్తున్నారు.
ఈ చిత్రం కొన్ని రికార్డులను బద్దలు కొట్టినా కానీ, వేగంగా బాక్సాఫీస్ వద్ద నీరసపడిపోయింది. క్రిస్టోఫర్ మెక్‌క్వారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్, ఎసై మోరల్స్, పోమ్ క్లెమెంటిఫ్, హెన్రీ క్జెర్నీ ఏంజెలా బాసెట్ తదితరులు నటించారు. పారామౌంట్ పిక్చర్స్, స్కైడాన్స్ , టిసి ప్రొడక్షన్స్ నిర్మించాయి.